రచయితగా మారిన సైఫ్ ఆలీ ఖాన్.. 2021లో జీవిత చరిత్ర విడుదల

బాలీవుడ్ నటుడు, చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్ రచయితగా మారబోతున్నారు. తన జీవితంలోని కీలక సంఘటనలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత జీవితంలోని ఘటనలు, విజయాలు, పరాజయాలు, స్ఫూర్తి పొందిన విషయాలకు పుస్తక రూపం కల్పించాలని నిర్ణయించుకొన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకాన్ని 2021లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ పబ్లిషర్ హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించనున్నది.

సైఫ్ ఆలీ ఖాన్ ఆటోబ్రయోగఫీని రాస్తున్నారనే విషయాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సైఫ్ ఆలీఖాన్ తన జీవిత చరిత్రను రాస్తున్నారు. తన కుటుంబం, వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లోని పలు విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించనున్నారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ పబ్లిషర్ హార్పర్ కాలిన్స్ ఇండియా 2021లో అందుబాటులోకి తెస్తుంది అని తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో స్పష్టత ఇచ్చారు.

Saif Ali Khan turns as Writer and pens his autobiography

కరోనావైరస్ లాక్‌డౌన్‌లో సైఫ్ ఆలీఖాన్ ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారనేది సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే దాదాపు తన ముఖ్య అంశాలను పేపర్‌పై పెట్టేశాడని, ఇంకా కొన్ని విషయాలను త్వరలోనే రాయడం పూర్తి చేస్తారు అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కరీనా ద్వారా సైఫ్‌కు తైమూర్ ఆలీ ఖాన్ సంతానం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సైఫ్ తన మొదటి భార్య అమృతాసింగ్‌ ద్వారా సారా ఆలీ ఖాన్, మరో కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే సైఫ్ నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X