NTR30: ఎన్టీఆర్ మూవీలో విలన్ ఆ స్టార్ హీరోనే.. ఆ రోల్ ఎలా ఉంటుందో తెలిస్తే!
దాదాపు ఐదారేళ్లుగా వరుసగా భారీ సక్సెస్‌లను ఖాతాలో వేసుకుంటూ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR అనే చిత్రంతో మరో పాన్ ఇండియా రేంజ్ హిట్‌ను అందుకోవడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సైతం సొంతం చేసుకున్నాడు.
దీంతో అతడితో ఉత్సాహం రెట్టించిందనే చెప్పాలి. ఈ ఊపులోనే ఇప్పుడు తారక్.. తన 30వ సినిమాను ఎంతో జోష్‌తో చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలోనే ఏర్పడ్డాయి.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది చాలా ఆలస్యం అయింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందని అంతా అనుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి.. ఆ వెంటనే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా మొదలు పెట్టేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్లను భాగం చేయాలని దర్శకుడు కొరటాల భావించారు. ఇందులో భాగంగానే ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన విలన్ పాత్రకు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారని గతంలోనే తెలిసింది.

కానీ, ఈ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో సైఫ్ అలీ ఖానే విలన్‌గా చేస్తున్నారట. అంతేకాదు, ఆయన పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుందని కూడా ఓ న్యూస్ బయటకొచ్చింది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.


Click it and Unblock the Notifications











