Saindhav Twitter Review వెంకటేష్ 75వ మూవీ ఎలా ఉంది? సైకో హ్యాట్రిక్ కొట్టాడా?
హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, శ్రద్దా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జర్మియా నటించిన చిత్రం సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజైన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దర్శకుడు చేరుకొన్నాడా? ఈ మూవీపై నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

సైంధవ్ ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సినిమా తొలి భాగంలో మొదటి 30 నిమిషాలు చాలా స్లోగా ఉంటుంది. స్టోరిలైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. గుడ్ యాక్షన్ సీక్వెన్స్, ఫెర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బీజీఎంకు చాలా స్కోప్ ఉంది. కానీ అంతగా ఆకట్టుకొన్న దాఖలాలైతే కనిపించలేదు అని వెంకీ రివ్యూ అన్నారు.
సైంధవ్ స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నప్పటికీ.. డ్రామా పార్ట్ ఫ్లాట్‌గా ఉంది. చాలా చోట్ల ఫ్లాట్‌గా కథ సాగుతుంది. కొన్ని చోట్ల హైస్ ఉన్నాయి. మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ చాలా వీక్‌గా ఉంది అని వెంకీ రివ్యూ తెలిపాడు.
సైంధవ్ ఫస్టాఫ్‌లో డిసెంట్ స్టఫ్ ఉంది. వెంకటేష్ కొత్త అవతారం నెవర్ బిఫోర్ లా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
సైంధవ్ గురించి యూఎస్ ఆడియెన్ ఓ ట్వీట్ చేస్తూ.. సైంధవ్ మూవీ చాలా ఫ్లాట్‌గా ఉంది. ఓవరాల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. వెంకీ మామ అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











