AR Rahman Divorce: విడాకులకు అసలు కారణమదే.. షాకింగ్ విషయాలను వెల్లడించిన రెహమాన్ భార్య..

AR Rahman divorced: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన వివాహ జీవితానికి ముగింపు పలికారు. తన 29 ఏండ్ల మార్యేజ్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ.. ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెహమాన్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. తన శిష్యురాలపై మనసు పారేసుకుని రెహమాన్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై ఏఆర్ రెహమాన్ సీరియస్ అయినా విషయం తెలిసిందే. తాజాగా ఈ పుకార్లపై రెహామాన్ మాజీ భార్య సైరా బాను స్పందించారు. విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడింది. పలు సంచలన విషయాలను వెల్లడించింది.

AR రెహమాన్ -సైరా బాను ల విడాకుల ప్రకటనతో యావత్తు సంగీత ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. వాళ్లిద్దరూ తమ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని తెలియజేస్తూ.. తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. ఈ సందర్బంగా విడాకుల ప్రకటనపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ.. మా వివాహాబంధం త్వరలో 30 ఏండ్లు పూర్తి చేసుకుంటుందని సంతోషించాను. కానీ, ఊహించని కారణాల వల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితులలో తనకు స్నేహితులు అండగా నిలుస్తారని, తన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని పేర్కొన్నారు.

Saira Banu reveals Reasons for divorce from Music director AR Rahman Revealed

అయితే.. రెహమాన్ - సైరా బానులు విడాకులు ప్రకటించిన రోజునే.. ఆయన శిష్యురాలు, బాసిస్ట్ మోహిని డే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు గుప్పుమన్నాయి. రెహమాన్ కు మోహినికి రిలేషన్ కలుపుతూ.. ఇష్టానుసారంగా రూమర్స్ క్రియేట్ చేశారు. ఆసిస్టెంట్ కారణంగా రెహమాన్ తమ 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారని వార్తలు గుప్పుమన్నాయి. నెట్టింట్లో లేనిపోని కథనాలు వైరల్ గా మారాయి. ఎవరికి నచ్చినట్టు వారు రూమర్స్ క్రియేట్ చేశారు.

ఈ నేపథ్యంలో వీటన్నింటిపై రెహమాన్ లాయర్ వందన షా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రెహమాన్ దంపతులు విడిపోవడానికి.. అతని అసిస్టెంట్ మోహిని విడాకులకు ఎలాంటి సంబంధం లేదనీ వెల్లడించారు. రహమాన్ సైరా బానులు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని, వారి వ్యక్తిగత కారణాల వల్లనే వారు విడిపోయారని వెల్లడించారు. రెహమాన్ దంపతులు.. వారి వివాహ బంధంలో ఎన్నో ఎత్తు పొలాలను చూశారని, వారిద్దరూ వీడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని, వారి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకు ఆ వివరాలను తాను వెల్లడించడం లేదంటూ పేర్కొన్నారు. అయినా ఈ రూమార్స్ ఆగడం లేదు. దీంతో తనపై వస్తున్న తప్పుడు కథనాలపై ఏఆర్ రెహమాన్ సీరియస్ అయ్యారు.

Saira Banu reveals Reasons for divorce from Music director AR Rahman Revealed

ప్రస్తుతం విడాకులపై ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను స్పందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఏఆర్ రెహామాన్ ప్రతిష్టను దిగజార్చవద్దని అభ్యర్థించారు. రెహమాన్ ,అతని కుటుంబాన్ని బాధపెట్టకుండా ఉండమని యూట్యూబర్‌లు, మీడియాను అభ్యర్థించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.సైరా బాను తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడింది. ప్రస్తుతం తాను ముంబయిలో ఉంటున్నాననీ, గత కొన్ని నెలలుగా తన ఆరోగ్యం బాలేదనీ, ఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నానని తెలిపారు.

యూట్యూబర్స్, మీడియా వారిని కోరుకునే ఒక్కటేననీ, తనపై ( రెహామన్ ) పై ఎలాంటి చెడు ప్రచారం చేయవద్దని కోరుకున్నారు. ఆయన చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. తాను రీట్‌మెంట్‌ కోసం ముంబయి వచ్చాననీ, రెహమాన్ అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఆయనకు కూడా తానంటే ఇష్టమన్నారు. ఇకపై నుంచి రెహమాన్ పై విమర్శలు చేయడం ఆపండని కోరుకున్నరు. ఈ క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించవద్దనీ, తాను త్వరలోనే చెన్నై వస్తానని సైరా బాను పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: ar rahman saira banu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X