Jacqueline Fernandez Birthday: సల్మాన్‌తో కిక్2.. సాజిద్ నడియావాలా ప్రకటన
తెలుగు, హిందీ భాషల్లో కిక్ సినిమా సాధించిన విజయం, కలెక్షన్లు సినీ పరిశ్రమలో ఓ రికార్డుగా నిలిచిపోయాయి. కిక్ సినిమా తర్వాత తెలుగులో కిక్2 వచ్చింది. కానీ హిందీలో కిక్2ను ఇంకా రూపొందించలేదు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ జన్మదినం సందర్భంగా కిక్2 సినిమాకు బీజం పడింది. తాను కిక్2 సినిమాను రూపొందిస్తున్నట్టు నిర్మాత సాజిద్ నడియావాలా ప్రకటించారు.
బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్ బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. ముంబైలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో జాక్వలైన్ తన సన్నిహితులతోనే వేడుకలను జరుపుకొన్నారు. అయితే జాక్వలైన్ బర్త్ సందర్భంగా సాజిద్ నడియావాలా ప్రకటించారు.

కిక్2 సినిమా గురించి ప్రకటిస్తూ సాజిద్ నడియావాలా ట్వీట్ చేశారు. ఈ ఉదయమే కిక్2 స్క్రిప్టును లాక్ చేశాం. సల్మాన్ ఖాన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జాక్వలైన్ పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొన్నాం. త్వరలోనే పూర్తిస్థాయి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం అని చెప్పారు.
కిక్2 గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ధృవీకరించారు. సాజిద్ నాడియావాలా కిక్2 స్క్రిప్టును లాక్ చేశారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











