twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Baahubaliతో మోసం.. ఇంతకన్నా ఘోరం ఉందా.. టికెట్ల వ్యవహారం మీద ఏపీ సర్కార్ ప్రతినిధి కీలక వ్యాఖలు!

    |

    సాయి ధరంతేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్ని కారణాల రీత్యా టార్గెట్ చేసి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టవద్దు అన్నట్టు మాట్లాడడంతో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా పవన్ ను విమర్శిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ మాట్లాడిన ఆన్లైన్ టికెట్ వ్యవహారాల మీద ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే

    బురద జల్లుకుని

    బురద జల్లుకుని

    ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఒళ్లంతా బురద జల్లుకుని రియాక్ట్ అవుతున్నారని, పవన్ తమ పాలిట గుదిబండ అయ్యారని ఇండస్ట్రీలో అందరూ పవన్ గురించి అనుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో రెండు గుర్రాలపై వెళ్లే వ్యక్తి పవన్ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

    అందరూ హ్యాపీ

    అందరూ హ్యాపీ

    అసలు ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై నిర్మాతలంతా సంతోషంగా ఫీల్ అవుతున్నారని ఎందుకంటే ఇప్పుడు సినిమాలతో వచ్చిన ఆదాయం అంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. ఒక వేళ ఆన్ లైన్ వస్తే ప్రభుత్వం సహా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎవరికి వెళ్లేది వారికి వెళ్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

    ముందుకే

    ముందుకే

    ఇక ఆన్ లైన్ టికెటింగ్ పై ప్రభుత్వం కేవలం సదుపాయాన్ని మాత్రమే కల్పిస్తుందన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను సినీ ప్రముఖులంతా ఆహ్వానిస్తున్నారని, ఆన్ లైన్ టికెట్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థ పై వారం పది రోజుల్లో విధి విధానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

    సూటిగా స్పష్టంగా

    సూటిగా స్పష్టంగా

    పారదర్శకంగా ఆన్ లైన్ వ్యవస్థ ఉండాలని సీఎం ఆదేశించారన్నా సజ్జల రామకృష్ణారెడ్డి సినిమా ధియేటర్లు నడిపే వ్యవహారం మాఫియాగా నడుస్తుందని ధియేటర్లు ఎవరు నడుపుతున్నారనేది ఎవరికీ తెలియడం లేదని అన్నారు. అంతే కాకా ఆన్ లైన్ టికెటింగ్ పై విమర్శలు చేసే వారు అభ్యంతరాలు ఏమిటో సూటిగా స్పష్టంగా చెప్పాలని అన్నారు.

    సిద్ధంగా ఉన్నాం

    సిద్ధంగా ఉన్నాం

    ఇక సినీ పెద్దలతో సమావేశానికి ఎప్పుడైనా సీఎం సిద్ధంగా ఉన్నారని చర్చలకు సినీ పెద్దలు ఎప్పుడు వచ్చినా ఆహ్వానిస్తామని సినిమా వారు ఎప్పుడైనా సీఎం అపాయింట్ మెంట్ తీసుకుని రావచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే బాహుబలి సినిమాకి తొలివారం 50 శాతమే టికెట్లు బుక్‌ అయినట్లు లెక్కలు చూపారని అంటున్నారని, ఈ బాహుబలి టికెట్ల అంశంపై ఒకసారి చెక్‌ చేయాలని ఆయన అన్నారు.

    Recommended Video

    Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
    అదే నిజమైతే మోసం చేసినట్టే

    అదే నిజమైతే మోసం చేసినట్టే

    ఇక అలా లెక్కలు చూపడం కనుక నిజమైతే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా? బాహుబలికి మొదటి వారంలో సగం టికెట్లే అమ్ముడైనట్టు చూపితే మోసం చేసినట్టే అని సజ్జల పేర్కొన్నారు. ఇక సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసని ఆయన అన్నారు. దీంతో ఇప్పుడు బాహుబలి లెక్కలు కూడా బయటకు తీయనుండడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎందాకా వెళ్లనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    Sajjala Ramakrishna Reddy sensational comments on baahubali tickets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X