అల్లు అర్జున్‌కు నేను పిచ్చి అభిమానిని.. ధోని నాకు అలాంటి సర్‌ప్రైజ్.. LGM ఈవెంట్‌లో సాక్షి ధోని
క్రికెట్ లెజెండ్ మహేంధ్రసింగ్ ధోని, ఆయన సతీమణి సాక్షి ధోని సినిమా రంగంలోకి అడుగుపెడుతూ నిర్మించిన చిత్రం LGM (Lets Get Marriage). ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించారు. లవ్ టుడే ఫేమ్ ఇవానా, హరీష్ కల్యాణ్, యోగిబాబు, ఆర్జే విజయ్ నటించిన ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 4వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో సాక్షి ధోని మాట్లాడుతూ..
నా భర్త ఎంఎస్ ధోని నాకు సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటాడు. నాకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌లలో సినిమా నిర్మాణం ఒకటి. క్రికెట్ అనేది అందరికి వినోదం. కానీ ఆయనకు ఓ ప్రొఫెషన్. క్రికెట్ మాదిరిగానే సినిమాలు కూడా వినోదాన్ని అందిస్తుంటాయి. అందుకే మేము వినోద పరిశ్రమలోకి ప్రవేశించడానికి సినిమా రంగాన్ని ఎంచుకొన్నాం. మేము ఓటీటీలో చాలా సినిమాలు చూస్తుంటాం. సినిమాలపై మాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టే మేము సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాం అని సాక్షి ధోని చెప్పారు.

LGM తర్వాత కూడా మేము చాలా సినిమాలు తీయాలనే ఆలోచనలో ఉన్నాం. తమిళంలో ధోనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాగే ధోనిని అభిమానించే వారు తెలుగులో కూడా ఉన్నారు. అందుకే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం. ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే ఆలోచనను పరిగణనలోకి తీసుకొంటాం అని సాక్షి ధోని చెప్పారు.
నేను చాలా తెలుగు సినిమాలు చూస్తుంటాను. యూట్యూబ్‌లో హిందీలోకి డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలను చూస్తుంటాను. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ అభిమానిని అయ్యాను. దాదాపు అల్లు అర్జున్ సినిమాలు దాదాపు అన్నీ చూశాను అని సాక్షి ధోని తెలిపారు.

సినిమా ప్రొడక్షన్‌లో నేను చురుకుగా పాల్గొన్నాను. స్టోరి డిస్కషన్‌లో దర్శకుడితో చర్చలు జరిపాను. బెటర్ అవుట్‌పుట్ కోసం రకరకాల ఫీడ్‌బ్యాక్ తీసుకొన్నాను. క్రియేటివ్ సైడ్ కూడా టీమ్‌తో కలిసి వర్క్ చేశాను. LGM సినిమా విషయానికి వస్తే.. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి కథ. ప్రతీ రిలేషన్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటిని అధిగమించి ఎలా వాటిని సరిద్దిద్దుకొన్నామనేది ముఖ్యం అని సాక్షి ధోని చెప్పారు.
జీవితంలో బంధాల గురించి తెలియజేసే చిత్రం. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎలా ఆలోచిస్తుందనే విషయంగా ఆధారంగా సినిమాను రూపొందించాం. LGM సినిమాలో చాలా విషయాలను డిస్కస్ చేశాం. ఈ సినిమా ఆగస్టు 4వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని సాక్షి ధోని చెప్పారు.


Click it and Unblock the Notifications











