Salaar First Review ప్రభాస్ స్టార్ పవర్ తడాఖా.. సలార్‌కు క్రిటిక్ రేటింగ్ 4/5!

KGF, KGF 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సలార్. డిసెంబర్ 22వ తేదీన అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఇచ్చిన రివ్యూలో ఏం చెప్పాడంటే?

సలార్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ. ఈ సినిమాలో మూడు పాత్రలు బలంగా ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని రోల్‌లో ప్రభాస్ చెలరేగిపోయాడు. స్క్రీన్ మీద స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్‌ మాత్రమే బాస్ అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని ఉమేర్ సంధూ తెలిపాడు.

 Salaar First Review: Critic Umair Sandhu review declares Prabhas move never before

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్‌ను మించిన మాస్ హీరో లేడని సలార్ సినిమాతో మరోసారి యంగ్ రెబల్ స్టార్ నిరూపించాడు. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చెబుతుంది. ఈ మూవీలోని ఆయన పాత్ర మళ్లీ స్టార్ పవర్‌ను చూపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ప్రభాస్ నటన రిమార్కబుల్‌గా ఉంది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో చెప్పారు.

 Salaar First Review: Critic Umair Sandhu review declares Prabhas move never before

ఇక సలార్ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలు బలంగా ఉన్నాయి. శృతి గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో కూడా మెప్పించింది. తెర మీద శృతిహాసన్ స్టన్నింగ్‌గా కనిపించింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమా చూస్తుంటే మజా వచ్చింది అంటూ ఉమేర్ సంధూ తన అభిప్రాయాన్ని చెప్పారు.

సలార్ సినిమా టెక్నికల్‌గా సౌండ్‌గా ఉంటుంది. యాక్షన్, ఫైట్స్ డిజైన్, సినిమాటోగ్రఫి హై రేంజ్‌లో ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది అని ఉమేర్ సంధూ తెలిపాడు.

సలార్ సినిమాలో యాక్షన్ సీన్లు, ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ నటన పక్కన పెడితే.. ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ మాత్రం ఫుల్ షాకింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు నా రేటింగ్.. 4/5 అంటూ సినిమాపై ఉమేర్ హైప్ చేశాడు.

 Salaar First Review: Critic Umair Sandhu review declares Prabhas move never before

ఇదిలా ఉంటే.. దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుడని చెప్పుకొనే క్రిటిక్ ఉమేర్ సంధూ ప్రతీ సినిమాకు ముందు తన సోషల్ మీడియాలో రివ్యూలు పోస్టు చేస్తుంటాడు. అయితే చాలా సినిమాలు రిజల్ట్ చూస్తే.. ఆయన చెప్పిన విషయాలు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సినిమాపై హైప్ బాగా ఉంది. ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని నిలబెడుతాడనే ధీమా అభిమానుల్లో ఉంది. కాబట్టి ఫిల్మీబీట్ తెలుగు ఫుల్ రివ్యూ, అప్‌డేట్స్ కోసం వేచి చూస్తుండండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X