Salaar సలార్ టికెట్లకు పోటెత్తిన ప్రభాస్ ఫ్యాన్స్.. పలుచోట్ల అభిమానులపై పోలీసుల లాఠీ చార్జీ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి రూపొందించిన చిత్రం సలార్. టీజర్లు, ట్రైలర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దాంతో ఈ మూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. ఇక అడ్వాన్స్ బుకింగ్‌ను నైజాంలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 19వ తేదీన ప్రారంభించారు. దాంతో ఈ సినిమా టికెట్ల కోసం భారీగా అభిమానులు పొటేత్తారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..
Recommended Video

కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించన సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత హిట్ లేకపోవడంతో సలార్‌పై రెబల్ స్టార్ అభిమానులు ఆశలు పెట్టుకొన్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే తమ అభిమాన నటుడి సినిమాను మొదటి ఆట చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎగబడ్డారు.

హైదరాబాద్‌లో పలు థియేటర్ల వద్ద అభిమానులు, ప్రేక్షకులు సలార్ టికెట్ల కోసం బారులు తీరి నిలుచున్నారు. కొన్ని థియేటర్ల వద్ద అభిమానులను అదుపు చేయడానికి కష్టంగా మారింది. దాంతో పోలీసులు, థియేటర్ల నిర్వాహకులు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో భారీగా గందరగోళం నెలకొన్నది. పలు చోట్ల థియేటర్ల వద్ద అభిమానులను కంట్రోల్ చేయడానికి లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను పంచింది. ఈ సినిమా ప్రత్యేక షోలు ప్రద్శరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
సలార్ సినిమా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి దాదాపు 20 చోట్ల వివిధ థియేటర్లకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్లకు 65 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్‌లకు 100 రూపాయలు పెంచుకొనే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 1 గంటలకు బెన్‌ఫిట్ షోకు అనుమతి ఇస్తూ జీవోలో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











