Salaar సర్‌ప్రైజ్‌పై వచ్చేసిన క్లారిటీ: కేజీఎఫ్ మూవీతో సంబంధం లేకుండానే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభం నుంచీ చాలా కాలం పాటు టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో అప్పటి నుంచి పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ మూవీ తర్వాత నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించాడు. అదే సమయంలో చాలా చిత్రాలను పట్టాలెక్కించేశాడు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తోన్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితమే 'రాధే శ్యామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేశారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు. దీనికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. దీనికి కారణం ఇది ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు వరకే వసూలు చేసి.. ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలను ఎదుర్కోవడమే.

Salaar Glimpse Not Attached to KGF Chapter 2

ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న దీన్ని 'కేజీఎఫ్' వంటి భారీ చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెండోది కూడా మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో టాకీ పార్టును జరిపించారు.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీ గ్లిమ్స్ వీడియో గురించి రెండు మూడు రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి జత చేసి రిలీజ్ చేయబోతున్నారని కూడా ఓ వార్త బయటకు వచ్చింది. అయితే, తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'సలార్' గ్లిమ్స్ వీడియోను కేజీఎఫ్‌కు జత చేయలేదట. దీన్ని త్వరలోనే సోలోగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలిసింది. దానికి సంబంధించిన డేట్‌ను కూడా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X