Salaar Movie: సలార్ దెబ్బకు సైడైన షారుఖ్ ఖాన్, పోస్ట్ పోన్ అయిన డంకీ!
Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమ తాజా చిత్రాలతో పోటీ పడబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఓ వైపు సలార్, మరోవైపు డంకీ చిత్రాలను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే రెండు చిత్రబృందాలు ప్రకటించాయి. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందని... ఎవరి సినిమాను ఎక్కువగా చూసేందుకు జనాలు ఇష్టపడతారని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అటు ప్రభాస్, ఇటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవ కూడా పడ్డారు.
ఇటు ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే షారుఖ్ ఖాన్ చిత్రానికి నష్టం జరుగుతుందని కొందరు.. షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయితే ప్రభాస్ కు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుందంటూ చర్చించారు. సలార్, డంకీ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా.. ఒకేసారి విడుదల అయితే ఎవరో ఒక్కరికి నష్టం వాటిల్లుతుందని సినీ విశ్లేషకులు వివరించారు. ఈక్రమంలోనే అటు ప్రభాస్, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ గొడవకు చెక్ పడబోతుంది. ఎలా అనుకుంటున్నారా...?


డంకీ సినిమా విడుదల వాయిదా పడబోతున్నట్లు తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. సలార్ దెబ్బకు షారుఖ్ ఖాన్ సైడ్ అయిపోయాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో షారుఖ్ ఖాన్ డంకీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. డంకీ పోస్ట్ పోన్ సలార్ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది.

ఇప్పటికే సలార్ సినిమా విడుదల సయమంలోనే రిలీజ్ కావాల్సిన తెలుగు చిత్రాలు సైంధవ్, హాయ్ నాన్న, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. తాజాగా షారుఖ్ ఖాన్ చిత్రం రిలీజ్ కూడా వాయిదా పడడంతో... డిసెంబర్ 22వ తేదీ రోజు సోలోగా సలార్ రాబోతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారం విలన్ గా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











