Salaar Movie: సలార్ టీం సాలిడ్ ప్లాన్.. నెలరోజుల ముందే స్పెషల్ అప్లికేషన్.. ఎందుకోసమంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా విడుదలకు నెల రోజుల ముందుగానే సలార్ చిత్ర బృందం అదిరిపోయే ప్లాన్ వేసింది. ఎవరూ ఊహించనని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ దరఖాస్తు చేసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే ఆ దరఖాస్తు ఏంటి, ఎందుకు అలా చేసుకున్నారు అనే అనుమానం వస్తోందా. ఏం లేదండి... ఏదైనా పెద్ద సినిమా విడుదల అవుతున్నప్పుడు.. ఎక్కువ రష్ ఉంటుందని భావిస్తే అదనపు షోలు వేసుకోవడానికి, టికెట్లు పెంచుకోవడానికి చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేది. అయితే ఏపీలో ఇలాంటి హక్కులు తీసుకోవడానికి మధ్యలో కాస్త ఇబ్బందులు వచ్చాయి.

 Salaar Movie Team Application For Ticket Prices Hike Before One Month

కానీ ఆ తర్వాత చాలా ఈజీగానే అనుమతులు వచ్చాయి. ముఖ్యంగా తమకు నచ్చిన వారి చిత్రాలకు ఒకలా, నచ్చని వారి చిత్రాలకు ఒకలా ఏపీ సర్కారు అనమతులు ఇస్తోందని చాలా మంది అభిప్రాయం. పవన్ కల్యాణ్ బ్రో సినిమా విషయంలో, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలకు సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఆది పురుష్ చిత్రానికి ఎలాంటి మసస్యా రాలేదు. ఈక్రమంలోనే మరోసారి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సలార్ చిత్రబృందం అదిరిపోయే ప్లాన్ వేసింది. సినిమా విడుదలకు నెల రోజుల ముందే ఐదు షోలు వేసుకుంటామని, టికెట్ల ధరలు పెంచుకుంటామని దరఖాస్తు చేసుకుంది.

 Salaar Movie Team Application For Ticket Prices Hike Before One Month

ముఖ్యంగా 50 రూపాయల నుంచి 75 రూపాయల మేర టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని ఆ అప్లికేషన్ లో కోరారు. అలాగే ఐదు షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కూడా అందులో ప్రస్తావించారు. ముందే అనుమతులు వస్తే సినిమా రిలీజ్ అప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా పనులు చేసుకోవచ్చని.. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

 Salaar Movie Team Application For Ticket Prices Hike Before One Month

సలార్ సినిమాని హోంబలే ఫిల్మ్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ముందు నుంచే ఫుల్ బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రంలో ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో, ఎంతమేర వసూళ్లు రాబడుతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X