Salaar Teaser: ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది.. ఒకేసారి రెండు సెలబ్రేషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా అతిపెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే ఎక్కువగా నెక్స్ట్ రాబోతున్న ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. ఇక మాస్ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రెండు సినిమాలతో తప్పకుండా ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. అయితే సలార్ కు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ ఈ మధ్య మళ్లీ స్లో అయింది అని కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే ఒక విధంగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండడం వల్లనే ఆ సినిమా ప్రమోషన్స్ కు బ్రేక్ ఇచ్చారు. ముందుగా ఆదిపురుష్ హడావిడి మొత్తం ముగిసిన తర్వాతనే సలార్ కు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఫ్యాన్స్ కు ఒక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఆదుపురుష్ తోపాటు దియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడే సలార్ సినిమా ఫ్యాన్ ఇండియా టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ టీజర్ కు సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందరినీ ఆకట్టుకునే విధంగా టీజర్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆదిపురుష్ సినిమాకు కూడా ఈ టీజర్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక సలార్ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ మధ్యలో ఈ సినిమా కూడా వాయిదా పడవచ్చు అని వార్తలు రాగా చిత్ర నిర్మాతలు అందులో ఎలాంటి నిజం లేదని సినిమా చెప్పినట్లుగానే అనుకున్న సమయానికి వస్తుంది అని క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











