Salaar Release Trailer: ఇద్దరు ప్రాణ స్నేహితులను బద్ధ శత్రువులు చేసిన ఖాన్సార్.. సలార్ అసలు కథ ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం సలార్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ అయింది. అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రశాంత్ నీల్ అభిమానులు సినిమా కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఎదురు చూడడమే కాదు.. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. స్టార్ హీరోల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతా ఈ సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు.
అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అనూహ్య స్పందన వచ్చింది. యూట్యూబ్ అంతా షేక్ అయిపోయేలా వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఆయన నెక్స్ట్ సినిమాలకే సాధ్యం అవుతోంది. అయితే ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. అందులో అదిరిపోయే అప్ డేట్లను ఇచ్చింది. సినిమా స్టోరీ మొత్తాన్ని ఈ రిలీజ్ ట్రైలర్ లోనే చూపించేశారు. ముఖ్యంగా గతంలో విడుదల అయిన ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు.. స్నేహితుడి సైన్యంగానే ప్రభాస్ నిలవబోతున్నట్లు తెలిసింది. కానీ ఖాన్సార్ కోసం ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారారంటూ ట్రైలర్ లో చూపించారు. ఇదంతా చూస్తుంటే సినిమా కథ అంతా వేరేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ నిజంగా అదిరిపోయింది. అసలు తుపాకీయే వాడడం రాని స్థాయి నుంచి దేశ వ్యాప్తంగా ఒకేసారి కాలిపోయేలా మెషీన్ గన్స్ వాడే స్థాయికి ఎదిగిపోయినట్లు చూపించారు. స్నేహితుడు కోరుకున్నది అతడికి దక్కకుండా తన వశం చేసుకోవడానికి ప్రభాస్ చాలా ఫైట్ చేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అంతకు మించిన స్టైల్ తో ప్రభాస్ ఇరగదీశాడు. ముఖ్యంగా హీరో స్నేహితుడిగా కనిపించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ చివరకు విలన్ గా మారడం మనం ఈ సినిమాలో చూస్తాం.
సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చే హీరో.. అతడు వద్దు అనుకున్న దాన్ని అంతం చేసేవాడని తెలుస్తోంది. అలాగే మధ్యలో కనిపించిన హీరోయిన్ శృతి హాసన్.. వెయిట్.. వెయిట్.. వెయిట్ ఐ నీడ్ ఎ డ్రింక్.. ముందు ఉందా అని అడిగే డైలాగ్ అయితే అదిరిపోయింది. ఇక ఆ తర్వాత ఖాన్సార్ ఎరుపెక్కాలా అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అయితే మరింత అదుర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈజీగా తెలిసిపోతుంది. ఖాన్సార్ కథ వల్ల ఎన్నో కథలు మారాయని... కానీ ఖాన్సార్ కథ మార్చింది మాత్రం ఇద్దరి స్నేహితుల శత్రుత్వమే అంటూ ఈ ట్రైలర్ ను ముగించారు.

ఇక చివర్లో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు టైటిల్ కార్డ్ వేశారు. మీరూ ఓసారి ఈ రిలీజ్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











