Salaar: భయంకరమైన గెటప్‌తో స్టార్ హీరో.. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్లుగానే!
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. టాలీవుడ్‌లో చాలా ఏళ్ల పాటు అలా హవాను చూపించిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు బహు భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. ఇప్పుడు ఏకంగా మూడు, నాలుగు భారీ సినిమాలను చేతిలో పెట్టుకున్నాడు. అందులో కేజీఎఫ్‌తో ప్రపంచాన్ని మొత్తం తన వైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో పూర్తైంది. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని హై ఓల్టేజ్ ఎపిసోడ్స్‌ను కూడా తీశారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూట్‌కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో షెడ్యూల్‌ను మొదులు పెట్టబోతున్నారు.

తాజాగా 'సలార్' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ ఒకటి విడుదలైంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తోన్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను అతడి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో అతడు భయంకరమైన గెటప్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఇందులో పృథ్వీరాజ్ 'వరదరాజ మన్నార్' అనే పాత్రను చేస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. దీంతో ఈ సినిమాలో అతడి రోల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2023 సెప్టెబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











