HBD Prashanth Neel: సలార్ నుంచి స్పెషల్ వీడియో.. సెట్స్‌లోనూ పవర్‌ఫుల్‌గానే!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అందులో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న చిత్రమే 'సలార్'. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాను.. కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్నాడు. ఇద్దరు క్రేజీ స్టార్లు కలిసి చేస్తుండడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో హై లెవెల్‌లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధిచిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని కొన్ని విరామాలతో చిన్నగా సాగుతోంది. అయినప్పటికీ ఇలా దాదాపుగా షూటింగ్‌ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది.

Salaar Team Releases Prashanth Neel Birthday Special Video

అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. ఈ సినిమాను అనుకున్న టైమ్‌కే విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ వీడియో విడుదలైంది.

ప్రశాంత్ నీల్ నేడు (జూన్ 4వ తేదీన)న పుట్టినరోజును జరుపుకుంటోన్నాడు. దీన్ని పురస్కరించుకుని 'సలార్' మూవీ యూనిట్ అతడి కోసం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఈ సినిమా షూటింగ్‌లో అతడు ఎలా ఉంటాడు అన్న దాన్ని చూపించారు.

పైకి ఎంతో కామ్‌గా ఉన్నట్లు కనిపించే ప్రశాంత్ నీల్.. సెట్స్‌లో మాత్రం ఎంతో పవర్‌ఫుల్‌గా పనులు చేస్తూ.. మిగిలిన వాళ్లతోనూ చేయిస్తున్నాడు. అలాగే, ప్రభాస్‌తో సరదాగా గడిపిన క్షణాలను కూడా ఈ వీడియోలో చూపించారు. దీంతో ఇది చాలా తక్కువ సమంయలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్‌లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X