తెలంగాణలో సలార్ టికెట్ రేట్లు ఎంత? నైజంలో 6 షోలకు గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ షోలు ఎక్కడెక్కడంటే?

తెలంగాణలో సలార్ మూవీ టికెట్ రేట్లను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరుగనున్నాయి. దాంతో ఈ సినిమాకు నైజాంలో భారీ కలెక్షన్లు రావడానికి అవకాశం ఉంది. గత కొద్ది రోజుల క్రితం సలార్ సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టికెట్ రేట్ల పెంపుకు విన్నవించుకొన్నారు. వారి విన్నపానికి అనుకూలంగా టికెట్ రేట్ల పెంచుతూ జీవోను రిలీజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నైజాంలో టికెట్ రేట్ల వివరాల్లోకి వెళుతూ..

Recommended Video

Salaar : Prabhas కు Telangana CM Revanth Reddy సపోర్ట్ .. కానీ అదొక్కటే లోటు | Telugu Filmibeat

సలార్ మూవీకి నైజాంలో ఆరు షోలు ప్రదర్శించుకొనేలా ప్రభుత్వం అనుమతించింది. అలాగే అభిమానులు నిర్వహించుకొనే బెన్‌ఫిట్ షోకు అనుమతించింది. దాంతో గురువారం (21వ తేదీ రాత్రి) అర్ధరాత్రి 1 గంటకు షో ప్రదర్శించనున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు అయింది.

Salaar ticket rates in Telangana: Prabhas movie Special Shows details in Nizam here

నైజాం ప్రాంతంలో సలార్ సినిమాకు 20 థియేటర్లలో స్పెషల్ షోలు ప్రదర్శించుకొనే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 20 థియేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. నెక్సస్ మాల్ కూకట్‌పల్లి
2. ఏఎంబీ సినిమాస్, గచ్చిబౌలి
3. బ్రమరాంబ థియేటర్, కూకట్ పల్లి
4. మల్లికార్జున థియేటర్, కూకట్ పల్లి
5. అర్జున్ థియేటర్ కూకట్ పల్లి
6. విశ్వనాథ్ థియేటర్, కూకట్ పల్లి
7. సంధ్య 70ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్
8. సంధ్య 30ఎంఎం, ఆర్టీసీ క్రాస్ రోడ్
9. రాజధాని డిలక్స్, దిల్‌షుక్ నగర్
10. శ్రీరాములు థియేటర్, మూసాపేట్
11. గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ
12. శ్రీసాయిరామ్ థియేటర్, మల్కాజ్‌గిరి

హైదరాబాద్ పరిధిలో కాకుండా జిల్లాల వారీగా సలార్ ప్రదర్శించే సినిమా థియేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..

13. ఎస్‌వీసీ తిరుమల, ఖమ్మం
14. వినోద థియేటర్, ఖమ్మం
15. వెంకటేశ్వర థియేటర్, కరీంనగర్
16. నటరాజ్ థియేటర్, నల్గొండ
17. ఎస్‌వీసీ విజయ థియేటర్, నిజమాబాద్
18. వెంకటేశ్వర థియేటర్, మహబూబ్ నగర్
19. శ్రీనివాస థియేటర్, మహబూబ్ నగర్
20. రాధిక థియేటర్, వరంగల్

సలార్ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్లలో 250 రూపాయలు, 175 రూపాయలు, 100 రూపాయలు. ఇక మల్టీ‌ప్లెక్స్‌ థియేటర్‌లో 370 రూపాయలు, 470 రూపాయలుగా నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X