బెండకాయ ఎందుకో తెలుసా? మంచు లక్ష్మికి, జగపతిబాబు షాకింగ్ జవాబు!
తెలుగు సినిమా దగ్గర చాలా మోస్ట్ పాపులర్ అండ్ భారీ మార్కెట్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఉన్నాయి. వాటిలో మెగా కుటుంబం, నందమూరి కుటుంబం, దగ్గుబాటి అలాగే అక్కినేని కుటుంబాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాగా వీరితో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి కూడా చాలా మంది హీరోస్ ఉన్నారు. కానీ వీరితో పాటుగా వీరికి మించిన ఫేమ్ ఉన్న కుటుంబంగా ఫీల్ అయ్యేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మంచు ఫ్యామిలీ అని చెప్పాలి.
కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా నటుడు మోహన్ బాబు చాలా మందికి తెలుసు. అయితే ప్రెజెంట్ ట్రెండ్ లో మంచు కుటుంబం నుంచి ఒక్క మంచు మనోజ్ తప్ప మిగతా వారి అందరి విషయంలో మాత్రం సోషల్ మీడియాలో అలాగే ఇతర ఆడియెన్స్ లో కూడా మంచి ఫన్నీగా ఏదొక సందర్భంలో కనిపిస్తూ ఉంటారు.

దీనితో మంచు ఫ్యామిలీ అంటే సోషల్ మీడియాలో మాత్రం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోణంలో ఎక్కువ కనిపిస్తుంది. కాగా మంచు మోహన్ బాబు కానీ అలాగే మంచు విష్ణు విషయంలో గాని అలాగే మంచు లక్ష్మి ప్రసన్న విషయంలో కానీ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ కూడా నడుస్తాయి.. అయితే తాజాగా మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మన తెలుగు సినిమాలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగ్గూ భాయ్.. అలియాస్ జగపతి బాబు సోషల్ మీడియాలో పిచ్చ కేజ్రీగా అలాగే మంచి యాక్టీవ్ గా ఉంటారు. చాలా సెటైర్స్ వేస్తూ తనపై కూడా తానే క్రేజీ పోస్టులు చేస్తుంటారు. అలా రీసెంట్ గా పెట్టిన ఓ పోస్ట్ కి మంచు లక్ష్మి కామెంట్ చేసింది. దీనికి జగపతిబాబు ఇచ్చిన షాకింగ్ రిప్లై నెటిజన్స్ నడుమ వైరల్ గా మారింది.
కాగా తన ఇన్స్టాగ్రామ్ లో జగపతి బాబు బెండకాయ జ్యూస్ అంటూ ఓ వీడియో పెట్టుకున్నారు. కాగా దీనికి మంచు లక్ష్మి బెండకాయ జ్యూసే ఎందుకు అంటూ కామెంట్ పెట్టింది. దీనితో జగపతి బాబు ఇచ్చిన షాకింగ్ రిప్లై అందరికీ బుర్ర పాడు చేసింది. జగపతిబాబు కావాలనే అన్నాడా లేక నార్మల్ గానే అన్నాడా అంటూ అంతా నవ్వుకుంటున్నారు. ఇంతకీ అంతలా తాను ఏమన్నారంటే మంచు లక్ష్మికి రిప్లై ఇస్తూ..

"లక్ష్మీ బెండకాయ రసం కొలస్ట్రాల్ కి చాలా మంచిది.. నాకూ నీకూ కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరం" అంటూ ఒక షాకింగ్ రిప్లై తాను అందించారు. దీనితో స్పాట్ లో మంచు లక్ష్మికి తల కొట్టేసినట్టు అయ్యింది. కాగా ఈ ఫన్ రిప్లై ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మంచు లక్ష్మిని జగ్గూ భాయ్ ఇలా అనేశాడేంటి అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. కాగా మొత్తానికి అయితే సలార్ విలన్ రిప్లై ఇంతపని చేసింది..


Click it and Unblock the Notifications











