'సైరా' ట్రైలర్‌పై బాలీవుడ్ స్టార్ హీరోల స్పందన.. ఏమన్నారంటే..!
చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలున్నాయి. అయితే ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవలే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ బాబు సహా, బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సైరా ట్రైలర్ పై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అమీర్ ఖాన్ స్పందిస్తూ.. ''సైరా' ట్రైలర్ ఇప్పుడే చూశా. చాలా అద్భుతంగా ఉంది. చిరంజీవి గారికి పెద్ద అభిమాని అయిన నేను... ఈ సినిమా చూడాలని కుతూహలంగా ఉంది. చిరంజీవి సార్, రామ్ చరణ్, మొత్తం టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే సల్మాన్ స్పందిస్తూ.. రామ్ చరణ్, చిరంజీవిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రోమాలు నిక్కబొడిచేలా ఉన్న 'సైరా నరసింహా రెడ్డి' ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్.. ఇప్పటివరకు 85 లక్షల వ్యూస్ దాటేసి పరుగులు పెడుతోంది. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











