Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్ అలా పాడగానే.. లవ్ సింబల్ పంపిన సమంత.. వీడియో వైరల్
అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప సినిమా తెలుగు ఇండస్ట్రీలో కంటే నార్త్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుందని చెప్పాలి. నార్త్ జనాలతో పాటు అక్కడ సినీ తారలు కూడా పుష్ప సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ కనిపిస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కూడా పుష్పకు సంబంధించిన పాటను పాడటంతో అందుకు తగ్గట్టుగా సమంత కూడా ఒక రియాక్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారీగా లాభాలు
అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియా హీరోగా చేసినా బిగ్ బడ్జెట్ మూవీ పుష్ప పార్ట్ 1 స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎంతో విభిన్నంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అంధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఎక్కువమంది ఎదురుచూస్తున్న సినిమా
పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చి నెలలో గడుస్తున్నా కూడా ఇంకా ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అల్లు అర్జున్ పేరు కూడా గట్టిగానే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ మీడియా సర్వే లో ఎక్కువ మంది ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో పుష్ప సెకండ్ పార్ట్ టాప్ లిస్టులో అవకాశం దక్కించుకోవడం విశేషం.
|
సల్మాన్ నోట పుష్ప ఐటెమ్ సాంగ్
ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కూడా పుష్ప సినిమాకు సంబంధించిన పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఏ పాట నచ్చింది అని సల్మాన్ ఖాన్ ని ఒక యాంకర్ అడగడంతో పుష్ప ఐటెమ్ సాంగ్ ఊ అంటావా మామ అంటూ పాడుకుంటూ వెళ్లడం సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సల్మాన్ ఖాన్ ఎంతో హుషారుగా ఆ పాటను పాడటం తో పుష్ప ట్యాగ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
సమంత రియాక్షన్
ఇక సల్మాన్ ఖాన్ అలా పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే సమంత కూడా దానిపై రియాక్ట్ అవ్వడం విశేషం. ఆమె ఒకేసారి మూడు లవ్ సింబల్స్ ను మెన్షన్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసుకుంది. సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పుష్ప ఐటమ్ సాంగ్ తోనే మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 ఎప్పుడంటే?
ఇక పుష్పా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు దర్శకుడు సుకుమార్ ఇంకా షూటింగ్ పనులు అయితే మొదలు పెట్టలేదు. ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ సమయంలోనే సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. కానీ మళ్లీ చివరలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం కాస్త ఎక్కువ సమయం తీసుకొని పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.