Britney Spears ‌తో చిరంజీవి, సల్మాన్ స్టెప్పులు.. గాడ్ ఫాదర్ పాట గురించి తమన్ ఏం చెప్పారంటే?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత రెండేళ్లుగా వెంటాడుతున్న కరోనావైరస్ పరిస్థితుల్లో కూడా అనేక రకాలుగా వార్తల్లో నిలిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. కరోనావైరస్ పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయలేకపోయిన ఈ స్టార్ హీరో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ప్రస్తుతం గురు రాంధ్వా, ఇలియా వాంటర్ సంయుక్తంగా పాడిన పాటలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌తో రొమాంటిక్‌గా కనిపించారు. ఇక తన సొంత సినిమాలతోపాటు టాలీవుడ్ చిత్రంలో చిరంజీవితో కలిసి నేరుగా నటించేందుకు సల్మాన్ సిద్దమవుతున్నాడు. ఆ వివారాల్లోకి వెళితే..

లూసీఫర్ రీమేక్‌లో రాంచరణ్, అల్లు అర్జున్ పేర్లు

లూసీఫర్ రీమేక్‌లో రాంచరణ్, అల్లు అర్జున్ పేర్లు


మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. అయితే ఇందులోని ఓ కీలకపాత్ర కోసం ముందుగా రాంచరణ్, అల్లు అర్జున్ పేర్లను పరిశీలించారు. కానీ ఎందుకో కుదర్లేదని సినీ వర్గాలు వెల్లడించాయి.

సల్మాన్ ఖాన్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో

సల్మాన్ ఖాన్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో

అయితే చిరంజీవి, రాంచరణ్ కోరిక మేరకు ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్ అంగీకరించారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో సల్మాన్ ఎప్పుడో పాల్గొనాల్సింది. కానీ కరోనావైరస్ కారణంగా వాయిదాపడింది. అయితే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ డేట్స్ మరోసారి రీ షెడ్యూల్ చేసినట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమా షూటింగుకు సల్మాన్ హాజరువుతారని వెల్లడిస్తున్నారు.

బ్రిట్నీ స్పియర్‌తో సల్మాన్, చిరు ఆటపాట

బ్రిట్నీ స్పియర్‌తో సల్మాన్, చిరు ఆటపాట


అయితే సల్మాన్ ఖాన్, చిరంజీవి మధ్య కీలక సన్నివేశాలతోపాటు ఓ పాటను కూడా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్ కూడా ఓ పాటలో స్టెప్పులే చేయడం ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ పాటలో బ్రిట్నీ స్పియర్‌తోపాటు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

తమన్ ఏం చెప్పారంటే...

తమన్ ఏం చెప్పారంటే...

గాడ్ ఫాదర్ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్ మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం పాట సిద్దమవుతున్నది. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం అని పేర్కొన్నారు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
చిరంజీవి సినిమాల వివరాలు..

చిరంజీవి సినిమాల వివరాలు..

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇంకా గాడ్ ఫాదర్‌తోపాటు భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా. ఇంకా తమిళ, మలయాళ సినిమాలకు సంబంధించిన రీమేక్ చిత్రాల్లో నటించడానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X