ప్రైవేట్ జెట్‌‌లో స్టార్ హీరోతో అర్థనగ్నంగా తమన్నా.. ఊర్వశి ఫ్యాన్స్ అలా లీక్

ప్రేమ జంట తమన్నా భాటియా - విజయ్ వర్మలు ఆకస్మాత్తుగా విడిపోవడంతో సినీ రంగం, అభిమానులు షాక్ అవుతున్నారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యారు. అలాంటిది ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడంతో అసలేం జరిగింది? ఇలాంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చిన కారణం ఏంటీ ? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంతో తమన్నాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య గాసిప్స్ సహజం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరి మధ్యో ఏదో ఉందని మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని నిజం కాగా.. మెజారిటీ వార్తలు గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. తమన్నా భాటియా కూడా ఇందుకు అతీతం కాదు. ఆమె కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి నేటి వరకు ఎందరితోనో ఎఫైర్స్ సాగించిందని మీడియాలో గాసిప్స్ వచ్చాయి. చివరికి పాకిస్తాన్ క్రికెటర్‌తోనూ తమన్నా భాటియాకు లింక్ అంటగట్టారు.

Salman Khan and Tamannaah Bhatia romantic pics Made by AI technology

ఇలాంటి పరిస్ధితుల్లో లస్ట్ స్టోరీస్ 2లో నటించి విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడ్డారు. రెండేళ్ల పాటు ఈ జంట పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని చక్కర్లు కొట్టింది. తమన్నా ఎక్కడుంటే విజయ్ అక్కడుండేవాడు. పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ జంట అనూహ్యంగా విడిపోయి సినీ అభిమానులకు షాకిచ్చింది. సరైన కారణాలు తెలియదు కానీ తమన్నా త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. విజయ్ మాత్రం కెరీర్‌లో ఫోకస్ పెట్టాలని భావించడమే ఈ బ్రేకప్‌కి కారణంగా బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఉన్నది లేదన్నట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ఏఐ భ్రమలు కల్పిస్తోంది. ఈ పరిజ్ఞానం జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా తమన్నా విషయంలోనూ ఏఐ టెక్నాలజీ వేలు పెట్టింది. గత కొద్దిరోజులుగా తమన్నా ఓ స్టార్ హీరోతో తిరుగుతున్నట్లుగా నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌. స్విమ్మింగ్‌పూల్‌లో రచ్చరచ్చ చేస్తున్నట్లుగా.. ఒకరి శరీరానికి ఒకరు చాక్లెట్ పూసుకుని తినిపించుకుంటూ ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది చూసిన వారు ఇదేంటీ నిన్న గాక మొన్న బ్రేకప్ జరిగితే తమన్నా - సల్మాన్‌లు ఇలాంటి ఫోజుల్లో ఉండటమేంటీ అని షాక్ అవుతున్నారు. అయితే ఇవన్నీ నిజమైన ఫోటోలు కావు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో చేసిన ఫోటోలు . ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలను ఇలా మార్ఫింగ్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తమన్నా - సల్మాన్‌లను కూడా అలాగే ఏఐతో టార్గెట్ చేశారు. ప్రస్తుతం విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పిన తమన్నా భాటియా ట్రెండింగ్‌లో ఉండటంతో ఈ ఫోటోలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X