For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవి తరువాత మరొక స్టార్ తో కూడా నటించబోతున్న సల్మాన్ ఖాన్.. ఆ హీరో ఎవరంటే?

    |

    బాహుబలి సినిమా కంటే ముందే తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్ కు పోటీగా స్థాయిని పెంచే విధంగా మెల్లగా అడుగులు వేస్తోంది. అయితే అప్పుడు మార్కెట్ ఎక్కువగా లేదు అని బాలీవుడ్ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుందో ఆ తర్వాత వారు చూసే విధానం ఒక్కసారిగా మారిపోయింది.

    బాలీవుడ్ స్టార్స్ తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసేందుకు నటీనటులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఎప్పటినుంచో తెలుగు ఇండస్ట్రీతో ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న సల్మాన్ ఖాన్ మరో తెలుగు హీరోతో కూడా నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.

    దిమ్మ తిరిగేలా..

    దిమ్మ తిరిగేలా..

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే హీరోయిన్స్ చాలావరకు మొదట్లో తెలుగు ఇండస్ట్రీ లోనే అవకాశాలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ అందుకుంటే బాలీవుడ్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలా వెళ్ళిన వారు అగ్రహీరోయినన్స్ క్లిక్కయ్యారు కూడా. అయితే బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత కొంతమంది తెలుగు సినిమాను చాలా తక్కువగా కూడా చూశారు. అలాంటివారికి దిమ్మతిరిగేలా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పాన్ ఇండియా సినిమాలలు తెరపైకి వస్తున్నాయి.

    టాలీవుడ్ పై ఆసక్తి

    టాలీవుడ్ పై ఆసక్తి

    ఇక భాషతో సంబంధం లేకుండా నటీనటులు కూడా ఎలాంటి విబేధాలు చూపించకుండా అన్ని భాషల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తెలుగు దర్శకులతో అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక తెలుగు నిర్మాతలకు ఎలాంటి ప్రాజెక్టులు తీసుకువచ్చిన కూడా గ్రీన్ ఇస్తున్నారు.

    లూసిఫర్ రీమేక్ లో

    లూసిఫర్ రీమేక్ లో

    అంతేకాకుండా స్పెషల్ రోల్స్ చేయడానికి గెస్ట్ రోల్స్ లలో కనిపించడానికి కూడా బాలీవుడ్ హీరోలు ఒప్పుకుంటున్నారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఎంత వరకు పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా మలయాళం బాక్స్ ఆఫీస్ హిట్ లుసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.

    వెంకటేష్ తో కూడా..

    వెంకటేష్ తో కూడా..

    అంతే కాకుండా సల్మాన్ ఖాన్ మరొక టాలీవుడ్ సీనియర్ హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంథిమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన సల్మాన్ ఖాన్ ఆ విషయం గురించి మాట్లాడాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత విక్టరీ వెంకటేష్ తో కూడా ఒక సినిమా లో కనిపించబోతున్నట్లు అఫీషియల్ గా వివరణ ఇచ్చాడు.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    వెంకీతో మంచి స్నేహం

    వెంకీతో మంచి స్నేహం

    అయితే ఆ సినిమా ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఇలాంటి సినిమా అనే వివరాలను మాత్రం సల్మాన్ ఖాన్ వెల్లడించలేదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమతో మాత్రం తనకు మంచి అనుబంధం ఉందని ముందు ముందు కూడా ఇంకా మంచి బంధాలు మొదలవుతాయని సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చాడు. ఇక వెంకటేష్ తో అయితే సల్మాన్ ఖాన్ కు మంచి స్నేహం ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు వెంకీ తెలుగులో రీమేక్ చేశాడు.

    English summary
    Salman khan comments on acting with another telugu hero..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X