సుశాంత్ సింగ్ ఫ్యాన్స్‌పై మొదటిసారి సల్మాన్ ఖాన్ కామెంట్.. బాధలో ఉంటే బుతులతో రెచ్చిపోతున్నారని..
బాలీవుడ్ ఇండస్ట్రీలో మునుపెన్నడు లేని విదంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపట్ల నెపోటీజమ్ అనే భూప్రకంపనలు కొంతమంది సెలబ్రెటీస్ లో ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎంతో కెరీర్ ఉన్న ఒక యువ హీరో ప్రాణం తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక సుశాంత్ అభిమానులపై సల్మాన్ ఖాన్ కామెంట్ చేయడం వైరల్ గా మారింది.
Recommended Video

సుశాంత్ కోసం మద్దతుగా..
సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ కి మద్దతుగా సాధారణ జనాలతో పాటు అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. సోషల్ మిడియాలోనే కాకుండా బహిరంగంగా కూడా నెపోటీజమ్ ఉన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో..
కేవలం స్టార్స్ కుటుంబ సబ్యులకు అవకాశాలు ఇస్తూ.. ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చేవారిని తొక్కేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ముందుగా కరణ్ జోహార్ పై విమర్శలు రాగా ఆయన సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రెటీస్ ని ఫాలో చెయ్యడం మానేశారు. ఇక అలియా భట్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. సల్మాన్ ఖాన్ పై కూడా విమర్శలు రావడంతో ఆయన స్పందించారు.

ఫ్యాన్స్ వార్..
సల్మాన్ ఖాన్ అభిమానులు, సుశాంత్ సింగ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఓ వర్గం వారు బుతులతో రెచ్చిపోతున్నారు కూడా. ఇక ఈ ఫైట్ కి ఎండ్ కార్డ్ పెట్టాలని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకొని తన అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు సల్మాన్.
అభిమానులకు రిక్వెస్ట్ అంటూ..
నా అభిమానులందరికి ఒక రిక్వెస్ట్.. ఇలాంటి విషాదకరమైన సమయంలో సుశాంత్ అభిమానులకు తోడుగా నిలబడండి. ఇది చాలా ఎమోషనల్ విషయం. అసభ్యకరమైన భాషతో శాపాలు పెట్టుకోవాల్సిన సమయం కాదు. అభిమానులకె కాకుండా సుశాంత్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని ఇది నిజంగా చాలా బాధించే విషయమని సల్మాన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











