God Father: సల్మాన్ ఖాన్‌ గురించి డైరెక్టర్ ట్వీట్.. అప్పుడే కంప్లీట్ చేసేశారా!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన.. రాజకీయాల కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే, ఆ మధ్య సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అనుమానాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఆయనలో ఉత్సాహం రెట్టించింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ఈ సీనియర్ హీరో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రామ్ చరణ్‌తో కలిసి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఆయన తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. ఇక, ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులోకి అనువదిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది.

Salman Khan Completes Major Schedule for God Father

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతారకు సంబంధించిన పార్ట్‌ను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ముంబైలో ఓ మేజర్ షెడ్యూల్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఇందులో కీలక పాత్రను పోషిస్తోన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన పార్ట్‌ను షూట్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను ఇప్పుడు సల్లూ భాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ముంబైలో దాదాపు పది రోజల నుంచి జరుగుతోన్న 'గాడ్ ఫాదర్' మేజర్ షెడ్యూల్ గురువారంతో పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు సల్మాన్ ఖాన్‌తో ఉన్న కొన్ని విజువల్స్‌ను యాడ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. అంతేకాదు, 'ప్రియమైన సల్లూ భాయ్‌తో అద్భుతమైన షెడ్యూల్‌ను తాజాగా పూర్తి చేసుకున్నాము. ఈ షెడ్యూల్‌ను ఎంతో సౌకర్యవంతంగా, సౌలభ్యంగా అయ్యేలా చేసిన భాయ్‌కు థ్యాంక్స్. అలాగే, మాకు పిల్లర్‌లా ఆసరాగా ఉండి సహాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి సార్‌కు ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు.

క్రేజీ కాంబోలో వస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార కూడా ఇందులో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X