Kisi Ka Bhai Kisi Ki Jaan ట్విట్టర్ రివ్యూ.. సల్మాన్ ఖాన్ ఇలా షాక్ ఇచ్చాడేంటి.. వెంకటేష్ పాత్ర ఎలా ఉందంటే?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కేవలం తన స్టార్ స్టామినాతో బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేసే అగ్ర హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కిసి కా భాయ్ కీసి కి జాన్ సినిమా నేడు గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇక ట్విట్టర్లో ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..
ఎంట్రీ మైండ్ బ్లోయింగ్:కిసి కా భాయ్ కీసి కి జాన్ ఎంట్రీ తోనే సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు అని అలాగే అతని ఎంట్రీ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన కొన్ని ఎలివేషన్స్ సీన్స్ అలాగే దానికి వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి అని అతని స్టైల్ స్వాగ్ అద్భుతంగా ఉంది అని కూడా అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని కూడా కొంతమంది ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

దారుణంగా ఉందని అంటూ..:మరికొందరు ఈ సినిమాపై ఊహించిన విధంగా నెగిటివ్ కామెంట్ కూడా చేస్తున్నారు. కిసి కా భాయ్ కీసి కి జాన్
అంచనాలను అందుకోలేకపోయింది అని చాలా నిరుత్సాహపరిచింది అని అలాగే ఫ్లాట్ లైన్ కూడా చాలా దారుణంగా ఉంది అని చాలామంది యాక్టర్స్ యాక్టింగ్ కూడా అంతగా కనెక్ట్ కాలేదు అని చెబుతున్నారు. సినిమా చూడడం నిజంగా సమయం అలాగే డబ్బులు కూడా వృధా అని మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సల్మాన్ ట్విస్ట్:ఇక ఈ సినిమాలో దర్శకుడు హైలెట్స్ సన్నివేశాలను అంతగా అద్భుతంగా ఏమి ప్రెసెంట్ చేయలేదు అని సినిమాలో క్యామియోగా దర్శకుడు ఆకట్టుకుంటాడు అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇక సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించి ఒక ఊహించిన ట్విస్ట్ కూడా ఉంటుంది అని సీన్స్ ను లీక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా చనిపోతుంది అని చెబుతున్నారు.
పూజా హెగ్డే అందంగా..:కిసి కా భాయ్ కీసి కి జాన్ రివ్యూలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చాలామంది ఈ సినిమా బాగుంది అని కామెంట్ చేస్తున్నారు అని మరికొందరు చెబుతున్నారు. తప్పకుండా సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడు అని ఇక పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది అని మరి కొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
వెంకటేష్ పాత్ర ఎలా ఉందంటే?:కిసి కా భాయ్ కీసి కి జాన్ సినిమాకు ఎక్కువగా మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా అంచనాలను ఏమీ అందుకోలేదు అని జస్ట్ ఓకే సినిమా అని రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇక వెంకటేష్ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా హైలెట్ అంటున్నారు. అసలు కథ చాలా బాగుంది అని లొకేషన్ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెబుతూ సల్మాన్ ఖాన్ యాక్టింగ్ అంతగా ఆకట్టుకో లేదని స్క్రీన్ ప్లే అయితే చాలా తేలికగా ఉంది అని ఇక మరికొన్ని పాటలు కూడా అంతగా క్లిక్ కాలేదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











