‘మేజర్’ కోసం సల్మాన్ ఖాన్.. టీజర్ అప్డేట్‌పై అడివి శేష్

ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్ మేజర్ మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మేజర్ అంటూ ఇప్పటికే వదిలిన వీడియోలు, టీజర్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత నెలలోనే విడుదల కావాల్సిన టీజర్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు టీజర్‌కు సంబంధించి అదిరిపోయే ప్రకటన చేశారు.

మేజర్ టీజర్ మార్చి 28న రిలీజ్ కావాల్సింది కానీ మేజర్ మూవీ డైరెక్టర్ ఫ్యామిలీలో విషాదం నెలకొనడం, కరోనా కేసులు కూడా పెరగుతూ ఉండటంతో మేజర్ టీజర్‌ను వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ టీజర్‌కు సంబంధించిన అతి పెద్ద ప్రకటనను చేశారు. టీజర్‌ను మూడు భాషల్లో ఒకే సారి విడుదల చేయనుండగా.. ముగ్గురు సూపర్ స్టార్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.

 Salman khan Mahesh babu And Prithvi raj For Adivi sesh Major Teaser

రేపు సాయంత్రం మేజర్ టీజర్‌ను హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, మళయాలంలో పృథ్వీరాజ్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏప్రిల్ 12న సాయత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మేజర్ టీజర్ రాబోతోంది. ఈ మధ్యే మేజర్ సినిమాలో హీరోయిన్ల పరిచయ పోస్టర్లను విడుదల చేయగా అవి బాగానే వైరల్ అయ్యాయి. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ జూలై 2న రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X