జాతీయ స్థాయిలో ఆ సినిమా గురించి దుమారం.. టైటిల్ మార్చాల్సిందే!
సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ నటిస్తున్న చిత్రం లవ్ రాత్రి. నవరాత్రి వేడుకల సందర్భంగా అక్టోబర్ 5 ఈ చిత్రాన్ని విడుదుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ విషయంలో చాలా కాలం నుంచి దుమారం రేగుతోంది. తాజగా ఆ వివాదం మరింత ఎక్కువైంది.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తుండడంతో ఏ సినిమా వివాదం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హిందువులు పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సినిమా తీస్తూ లవ్ రాత్రి అని టైటిల్ పెట్టడం దుమారం రేపుతోంది.

హిందువుల మనో భావాలని కించపరిచేలా ఉన్న టైటిల్ వెంటనే మార్చాలని బెంగుళూరులో హిందూ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. నవరాత్రి సందర్భంగా ఓ యువకుడు, యువతి ప్రేమలో పడతారు. ఈ అంశంతోనే లవ్ రాత్రి చిత్రం సాగుతుంది. చిత్ర టైటిల్ మార్చకుంటే విడుదల అడ్డుకుని తీరుతామని ఆందోళన కారులు హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











