ప్రియాంక రెడ్డి హత్య : సల్మాన్ ఖాన్ రియాక్షన్ వైరల్.. ఆమె తల్లిదండ్రుల డిమాండ్ అదే
ప్రియాంకరెడ్డి ఘటన ఎల్లలు దాటిపోతోంది. యావత్ భారతావని గొంతెత్తుతోంది. ప్రియాంక రెడ్డి దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు.

పరామర్శించిన అలీ..
ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని సీనీ రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈక్రమంలో సినీ నటుడు అలీ నేడు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను కలిసి పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకరెడ్డి ఘటన చాలా బాధాకరమని, వారి ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకెవరి ఇంట్లో జరగకూడదని అన్నారు.

అలాగే తగలబెట్టాలి..
ప్రియాంక తల్లిదండ్రులతో తాను మాట్లాడినప్పుడు వారు ఒకటే డిమాండ్ చేశారని అన్నాడు. తమ కూతురు ఎలాంటి పరిస్థితుల్లో మృతి చెందిందో అలాగే నిందితులను కూడా తగలబెట్టాలి అని కోరారని పేర్కొన్నాడు. ప్రియాంక తల్లిదండ్రుల కడుపుకోత వర్ణణాతీతంగా ఉందని అన్నాడు. తన కూతురు కూడా డాక్టర్ చదువుతోందని, డాక్టర్ అయిన కూతురు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధ పడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానని అన్నాడు.
రాక్షసులను అంతం చేయాలి..
‘మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసులే అత్యంత హేయనీయం. అమాయకులైన నిర్భయ, ప్రియాంక రెడ్డి.. వారు పడిన బాధ, వారి మరణం లాంటి ఘటనలతోనైనా సమాజం ఒక్కతాటిపైకి వచ్చి.. మరో అమాయకురాలు బలికాక ముందే అలాంటి రాక్షసులను అంతం చేయాలి.. భేటీ బచావో అనేది కేవలం క్యాంపెన్ కాకూడదు.. ఈ ఘటనలకు వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలి.. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు.
గుండెలోంచి రక్తం.. కోపంతో నిండింది..
ప్రియాంక రెడ్డి వార్త వినగానే.. నా గుండె బద్దలైంది.. రక్తం కారినట్టు బాధేసింది.. విపరీతమైన కోపంతో నిండింది.. ఇలాంటి ఘటనలను కేవలం ఖండిస్తే సరిపోదు.. ఖండిస్తే సరిపోదు.. అంటూ ఎంతో భావోద్వేగానికి గురైన హన్సిక ఈ మేరకు ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











