హిందు ముస్లిం భాయ్ భాయ్.. సల్మాన్ వీడియో వైరల్
ప్రతీ ఏడాది తన సినిమాతో ఈద్ రోజున పలకరించే సల్మాన్ ఖాన్ కరోనావైరస్ కారణంగా అభిమానులకు దగ్గర కాలేకపోయారు. కానీ హిందూ, ముస్లింల ఐక్యతను చాటే వీడియోతో సల్లూభాయ్ సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భాయ్ భాయ్ అనే టైటిల్‌తో జాతి సమైక్యతను చాటే విధంగా వీడియో ఆల్పమ్‌ను రూపొందించారు. సెక్యులరిజం కాన్సెప్ట్‌తో సల్మాన్ ర్యాప్ సాంగ్‌తో అభిమానుల్లో సంతోషాన్ని నింపారు.
భాయ్ భాయ్ అనే పాటను రుహాన్ అర్షద్‌తో కలిసి సల్మాన్ ఖాన్ పాడారు. ఈ పాటకు సాజిద్ వాజిద్ సంగీతం అందించారు. ఈ పాటకు సల్మాన్ ఖాన్, డానిష్ సబ్రి సాహిత్యం అందించారు. ర్యాప్ సాహిత్యాన్ని రుహాన్ అర్షద్ రాశారు. యారో హమ్ తయార్ హై.. అప్పీ హై త్యోహార్ హై.. అంటూ సాగే పాటలో హిందూ, ముస్లిం భాయ్ భాయ్.. క్యాబోల్తే మియా భాయ్.. హిందూ ముస్లిం భాయ్ భాయ్, క్యాబోల్తే హిందూ బాయ్ అంటూ హుషారుగా పాటలో చిన్న స్టెప్పులతో అలరించారు.

భాయ్ భాయ్ వీడియో ఆల్బమ్ రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ప్రతీ ఒక్కరికి ఈద్ ముబారక్. కరోనావైరస్ పోరాటానికి ప్రతీ ఒక్కరికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను. ఈద్‌కు సినిమాను రిలీజ్ చేయలేకపోయాను. అందువల్ల నా ఫ్యాన్స్‌కు ఓ అద్భుతమైన, ప్రత్యేకమైన పాటను అందించాలని అనుకొన్నాను. సోదరభావం, ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచే ఈ భాయ్ భాయ్ పాటను అందిస్తున్నాను అని తెలిపారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోయినప్పటి నుంచి సల్మాన్ మూడు పాటలు రిలీజ్ చేశారు. ప్యార్ కరోనా, తెరే బినా పాటల తర్వాత భాయ్ భాయ్ అంటూ జాతి సమైక్యతకు చిహ్నంగా నిలిచే పాటను రూపొందించారు.


Click it and Unblock the Notifications











