twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐదు గెటప్స్‌తో సల్మాన్.. భారత్ మోషన్ పోస్టర్ వైరల్

    |

    Recommended Video

    Salman Khan-Starrer Bharat Motion Poster Released ! | Filmibeat Telugu

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కేక పెట్టిస్తున్నది. ఈ చిత్రంలో సల్మాన్ పోషించిన వివిధ రకాల గెటప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రంజాన్ పండుగకు ఈ చిత్రం రిలీజ్ కానున్నది. 1964 నుంచి ప్రారంభమై.. 2010 వరకు సాగే కథలో రకరకాల షేడ్స్‌లో సల్మాన్ కనిపించే అన్ని పాత్రలను గత కొద్దిరోజులుగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే

    ఐదు రకాల గెటప్స్‌తో

    ఐదు రకాల గెటప్స్‌తో

    1964లో సర్కస్‌లో స్టంట్ మాస్టర్‌గా, 1970లో మైనింగ్‌లో పనిచేసే కూలీగా, 1985లో నేవీలో పనిచేసే ఆఫీసర్‌గా, 1990లో వయసు మీద పడిన వ్యక్తిగా వివిధ గెటప్స్‌లో సల్మాన్ ఖాన్ కనిపిస్తారు. వీటికి సంబంధించిన మోషన్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

     సల్మాన్ సరసన కత్రినా కైఫ్

    సల్మాన్ సరసన కత్రినా కైఫ్

    భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తున్నది. ఈ సినిమాలో లక్కీగా సల్మాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కింది. ప్రియాంక చోప్రా ఈ సినిమాను వదిలేయడంతో ఆ అవకాశం కత్రినాకు దక్కిన సంగతి తెలిసిందే. 2017 తర్వాత టైగర్ జిందా హై సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు.

     సల్మాన్ ఖాన్ నిర్మాతగా

    సల్మాన్ ఖాన్ నిర్మాతగా

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారత్ చిత్రానికి సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రంలో టబు, జాక్రీ ష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, సొనాలి కులకర్ణి, నోరా ఫతేహీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

     జూన్ 5న విడుదల

    జూన్ 5న విడుదల

    దక్షిణ కొరియాలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్న ఆడ్ టు మై ఫాదర్ చిత్రానికి రీమేక్ భారత్. ఈ చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జూలియస్ పాకియం, సినిమాటోగ్రఫి జార్జ్ సీ విలియమ్స్, రామేశ్వర్ ఎస్ భగత్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.

    English summary
    After upping our anticipation levels by dropping some interesting posters and teaser of Bharat, the makers have now released the official motion poster of this Ali Abbas Zafar directorial. Touted to be one of the most anticipated movies of this year, Bharat reunites the magical trio- Salman Khan, Katrina Kaif and Ali Abbas Zafar after their last blockbuster 'Tiger Zinda Hai'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X