బిగ్‌బాస్ షో ప్రారంభం డేట్స్ ఫిక్స్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..
బిగ్‌బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో విజయవంతంగా 12 సీజన్లు పూర్తి చేసుకొన్నది. త్వరలోనే 13వ సీజన్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బిగ్‌బాస్ 13 జాబితా ఇదే అంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ నటులు కరణ్ పటేల్, హీరోయిన్ జరీన్ ఖాన్ ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో హడావిడి చేయనున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇలాంటి వార్తల నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 13 ప్రసారమయ్యే తేదీలను నిర్వాహకులు వెల్లడించారు. మేము అధికారికంగా టీమ్‌తో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించాం. సెప్టెంబర్ చివరి వారంలో గానీ, అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ తాజా సీజన్ ఖచ్చితంగా సెప్టెంబర్ 29న ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

బిగ్‌బాస్ 13 సీజన్ 15 వారాలపాటు సాగుతుంది. జనవరి 12, 2020 వరకు ఇది కొనసాగుతుంది అని నిర్వాహకులు తెలిపారు. కరణ్ పటెల్, వివేక్ దోహియా, జయ్ భానుషాలి, మహీ విజ్ తదితరులు పాల్గొంటారని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications