నిన్ను ఎంతలా ప్రేమించానో నా మాత్రమే తెలుసు.. చైతూ- శోభితల పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత...

Samantha: అక్కినేని నాగచైతన్య- శోభితాలు ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసింది. తాజాగా సమంత.. నాగచైతన్య- శోభితాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

హీరోయిన్ సమంత విడాకుల అనంతరం నాగచైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమలో పడ్డారు. ఈక్రమంలో పలుమార్లు ఈ జంట మీడియా కంటపడింది. కానీ, ఈ విషయం బయటికి రాకముందుకే వీరి ప్రేమ బంధాన్ని పెద్దలు ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు కలిసి సీక్రెట్ గా అక్టోబర్ 8న ఎంగేజ్మెంట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో కేవలం అక్కినేని ఫాన్సీ కాకుండా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఇటీవల డిసెంబర్ 4న వీరి వివాహ మహోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఘనంగా జరిగింది. ఇప్పటికీ వీరి ఫోటోలు సోషల్ మీడియాలో దిగా వైరల్ అవుతున్నాయి.

Samanta Dhulipala shares emotional moments from Sobhita and Naga Chaitanya wedding

శోభిత దూళిపాళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఆరు నెలలుగా ఈ అమ్మడు పేరు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇండస్ట్రీలో కూడా మారుమోగుతోంది. శోభితా అచ్చ తెలుగు అమ్మాయి అయినా.. టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తొలుత రామన్ రాఘవ్ 2.0 చిత్రంలో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీలలో నటించిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అడవి శేషు హీరోగా తెరకెక్కిన 'హిట్ 2' సినిమాతో నటించి తెలుగులో అడుగుపెట్టింది. ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాలలో కూడా నటించింది.

ఇక శోభిత నాగచైతన్య కూడా వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే .. తాజాగా శోభిత సోదరి సమంత(Samantha ) గురించి కూడా అందరికీ తెలిసిందే. అమ్మడు వృత్తిరీత్యా డాక్టర్. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన అక్క శోభిత పెళ్లి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇలా తన అక్క పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ఈమె తన అక్క గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Samanta Dhulipala shares emotional moments from Sobhita and Naga Chaitanya wedding

'ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.. అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ‍ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు. అత్యంత గౌరవప్రదమైన జంట శోభితా చైతూ' అంటూ తన అక్క బావకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక శోభిత నాగచైతన్య ఇద్దరు కలిసి ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. కానీ, వీరిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కలిసి స్నేహితులయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు కలువడంతో ప్రేమలో పడటం, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

More from Filmibeat

Read more about: shobhita naga chaitanya samanta
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X