షాకింగ్ .. సమంత చేతుల మీదుగానే నాగచైతన్య - శోభిత వివాహం, ఫోటోలు వైరల్!
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ మరో రెండ్రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. దీంతో వీరి వివాహానికి గెస్ట్‌లుగా ఎవరెవరు వస్తున్నారు? వధువరూలిద్దరూ ఎలాంటి బట్టలు వేసుకోనున్నారు? ఇలా తెలుగునాట వీరి పెళ్లి గురించి డిస్కషన్ నడుస్తోంది.
నిజానికి నాగచైతన్య - శోభితల మధ్య ఏదో యవ్వారం నడుస్తోందని మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. అయితే వీటిని జనం గాసిప్స్‌గానే కొట్టేశారు. అయితే చివరికి ఆ పుకార్లనే నిజం చేస్తూ చైతూ - శోభితలు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్ధాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున కన్ఫర్మ్ చేశారు. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తన్న తమ హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

చైతూ - శోభితల ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి వీరి పెళ్లెప్పుడు? ఇండియాలో చేసుకుంటారా? లేక ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? అంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే సస్పెన్స్‌కు తెరదించుతూ ఇండియాలోనే అది కూడా హైదరాబాద్‌లోని వారి అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య - శోభితల వివాహానికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి వెడ్డింగ్ కార్డ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక కాబోయే కోడలు శోభిత కోసం అక్కినేని కుటుంబ సభ్యులు ఖరీదైన కానుకలు, బహుమతులు సిద్ధం చేసినట్లుగా చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. రూ. కోటికి పైగా విలువైన టయోటా లెక్సస్ కారును శోభిత కోసం చైతూ కొన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు ఖరీదైన బంగారు ఆభరణాలను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా.. శోభిత ఇంట్లో పెళ్లి పనులు ఘనంగా మొదలయ్యాయి. మొన్నామధ్య ముత్తయిదువులతో కలిసి పసుపు కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
తాజాగా రెండ్రోజుల క్రితం రాటా .. స్తపన, మంగళ స్నానం అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేశారు. పసుపు రంగు చీర కట్టుకున్న శోభితకు కుటుంబ సభ్యులు మంగళ స్నానం చేయించిన ఫోటోలను ఇందులో చూడొచ్చు. అనంతరం తల్లిదండ్రులు, సోదరితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను శోభిత ధూళిపాళ పంచుకున్నారు. తాజాగా ఆమె సోదరి సమంత షేర్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చీరలో కాళ్లకు పసుపు రాసుకుని, ఎరుపు రంగు గాజుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న శోభిత ఫోటోలు కలర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇక ఈ వేడుకలో సందడి మొత్తం సమంతతే అనడంలో అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications











