రకుల్ ప్రీత్ సింగ్‌కు సారీ చెప్పిన సమంత.. డ్రగ్స్ ఆరోపణల తర్వాత తొలిసారి స్పందన

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లాక్ డౌన్ మొదలైనప్పటికి నుంచి ఎదో ఒక వార్త అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఇక సుశాంత్ మృతి తరువాత ఉహాలకందని రీతిలో అనేక కోణాల్లో బాలీవుడ్ పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ తారలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఇటీవల రకుల్, సారా అలీ ఖాన్ వంటి వారి పేర్లు డ్రగ్స్ రాకెట్ లో భయటపడినట్లు వార్తలు రావడంతో సమంత స్పందించింది.

Recommended Video

#SorryRakul : Rakul Preet Singh, Sara Ali Khan కి సారీ.. తొలిసారి స్పందించిన Samantha Akkineni
నేరం రుజువు కాకముందే..

నేరం రుజువు కాకముందే..

నేరం రుజువు కాకముందే బాలీవుడ్ మీడియా తప్పుగా చూపిస్తోందని గత కొన్ని నెలలుగా సెలబ్రెటీలు ఖండిస్తున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా చక్రవర్తి డ్రగ్స్ వాడడమే కాకుండా సుశాంత్ కి కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే 25మంది బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా బయటపెట్టినట్లు ఎవరికి వారు బ్రేకింగ్ న్యూస్ లు ఇచ్చారు.

ఆ వార్తల్లో నిజం లేదు..

ఆ వార్తల్లో నిజం లేదు..

ఈ విషయంపై NCB డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి డ్రగ్స్ రాకెట్ విషయంలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. రియా కేవలం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వారి పేర్లు మాత్రమే బయటపెట్టింది.

బాలీవుడ్ స్టార్స్ అరెస్ట్.. అది కూడా అబద్ధమే

బాలీవుడ్ స్టార్స్ అరెస్ట్.. అది కూడా అబద్ధమే

ఇక 25మంది బాలీవుడ్ స్టార్స్ తో డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని వస్తున్న కథనాల్లో నిజం లేదు. అలాగే ఎక్కువగా ఈ కేసులో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ ని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు వస్తున్న రూమర్స్ కూడా అవాస్తవమే. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ వంటి వారి పేర్లను కూడా ఎక్కువగా ప్రచారం చేశారు.

కేవలం వారి పేర్లు మాత్రమే ఉన్నాయి

కేవలం వారి పేర్లు మాత్రమే ఉన్నాయి

అందులో కూడా ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా దగ్గర కేవలం డ్రగ్స్ స్మగ్లర్లుగా ఉన్న వారి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇతర బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఒక ఫామ్ హోజ్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న కథనాల్లో కూడా నిజం లేదని చెప్పిన మల్హోత్రా కేసులో ప్రస్తుతానికి ఇతర స్టార్స్ కి ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు.

క్షమాపణలు చెప్పిన సమంత

క్షమాపణలు చెప్పిన సమంత

ఇక కేసు విషయంలో ఇంతవరకు. పెద్దగా స్పంధించని స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఫైనల్ గా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అందరితరపున రకుల్ కి అలాగే సారా అలీ ఖాన్ కి క్షమాపణ చెబుతున్నట్లు ఒక పోస్ట్ చేసింది. సమంతతో పాటు మరికొందరు సెలబ్రెటీలు నెటిజన్స్ కూడా సారి రకుల్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X