For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల రూమర్స్ కు ఒక్క దెబ్బతో కౌంటర్ ఇచ్చేసిన సమంత... ఊపిరి పీల్చుకున్న అభిమానులు

  |

  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో కలవర పెట్టిన సమంత - నాగ చైతన్య విడాకుల రూమర్స్ పై మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకే ఒక్క మాటతోనే సమంత వారి బంధం గురించి ఫుల్ క్లారిటీ చేసింది. సాధారణంగా సెలబ్రిటీ కపుల్స్ మధ్య కాస్త దూరం పెరిగిన కూడా విడిపోయారు అని కథనాలు రాయడం కామన్ గా వస్తున్నదే.

  ఇది చాలా రోజులుగా సమంత నాగచైతన్య కూడా చాలా దూరంగా ఉంటున్నారని వీరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కూడా ఇన్ డైరెక్ట్ గా కథనాలు వచ్చాయి. అయితే సమంత, నాగ చైతన్య పేర్లు వాడకుండానే టాలీవుడ్ లోని ఒక ఫ్యామిలీ కపుల్స్ విడిపోతున్నట్లు స్టోరీలు అల్లేశారు. ఇక ఫైనల్ గా ఆమె ఒక్క మాటతోనే వాటిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పుట్టినరోజు సందర్భంగా మామ గారికి సమంత ప్రత్యేకంగా విషెస్ ను అందించారు.

  ఆ సినిమా తరువాత

  ఆ సినిమా తరువాత

  సమంత నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా తరువాత ఒకరికి ఒకరు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. నాగచైతన్యకు అది రెండవ సినిమా కాగా సమంతకు అది మొదటి సినిమా. ఇక వీరి కలయికలో వచ్చిన మొదటి విజయం కూడా అదే. ఇక ఆ సినిమా అనంతరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో మరింత దగ్గరయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ కు శ్రీకారం చుట్టారు. పెళ్లి తరువాత కూడా కలిసి నటించారు. పెళ్లికి ముందు ఏ మాయ చేసావే.. అలాగే మనం సినిమాతో పాటు ఆటో నగర్ సూర్య సినిమాలో కలిసి నటించిన వీరు చివరగా మజిలీ సినిమాలో ఎమోషనల్ లవ్ బర్డ్స్ గా కనిపించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.

  ఎంతో బాధ్యతగా..

  ఎంతో బాధ్యతగా..

  ఇక సమంత నాగ చైతన్య ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య లో పెద్దగా విభేదాలు రావని ఈజీగా అర్థమవుతుంది. నాగచైతన్య చాలా కూల్ గా ఉంటాడు. ఎలాంటి సమస్యలు తలెత్తినా కూడా ఎక్కువగా వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఇక సమంత కూడా దాదాపు అదే తరహాలో ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. భర్త ప్లాప్ లో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతతో మజిలీ లాంటి కథలను సెలెక్ట్ చేసుకుని మంచి విజయం దక్కేలా చేసింది.

  Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
  బెస్ట్ కపుల్స్ అనేలా

  బెస్ట్ కపుల్స్ అనేలా

  సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ప్రతి ఆనందాన్ని ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి కేవలం టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో బెస్ట్ కపుల్స్ గా అధికారుల నుంచి మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. ఇక ఇటీవల కొన్ని విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు అని అనేక రకాల స్టోరీలు చుట్టేశారు.

  అసలు క్లారిటీ ఇచ్చేశారు

  అసలు క్లారిటీ ఇచ్చేశారు

  ఆ విషయంలో అభిమానులు కాస్త కంగారు పడ్డారు రూమర్స్ డోస్ పెరుగుతున్న కూడా ఎవరి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో నిజం అయ్యి ఉండవచ్చని కూడా అనుకున్నారు. కానీ సమంత ఆ విషయంపై డైరెక్ట్ గా స్పందించకుండా తన మామ నాగార్జున పుట్టిన రోజున భావోద్వేగమైన ట్వీట్ తో ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.'మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు.

  ప్రతి రోజు మరియు ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యం మరియు సంతోషం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మంచి మనిషి అయినటువటి నాగార్జున మామకు పుట్టిరోజు శుభాకాంక్షలు' అంటూ సమంత ట్విట్టర్ లో అయితే వివరణ ఇచ్చింది. సమంత మామ అని పిలవడంతో వారి మధ్య ఉన్న బంధం ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతొంది. నాగచైతన్య సమంత విడిపోతున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని కూడా ఈ ఒక్క మాటతో అర్ధమైపోయి ఉంటుంది. మొత్తానికి ఫ్యాన్స్ అయితే కింగ్ నాగార్జున పుట్టినరోజున కొంత ఊపిరి పీల్చుకున్నారు.

  సినిమాల విషయానికి వస్తే..

  సినిమాల విషయానికి వస్తే..

  ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య చివరగా వెంకీ మామ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఆ తరువాత లవ్ స్టొరీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు చేశాడు గాని వర్కౌట్ కాలేదు. కరోనా లాక్ డౌన్ వలన ఆ సినిమా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా, బంగార్రాజు, థాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

  మరోవైపు సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ చాలానే వస్తునప్పటికి సమంత చాలా నెమ్మదిగా కేవలం తనకు నచ్చిన పాత్రలోనే కనిపోస్తోంది. మరి రానున్న రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూడాలి.

  English summary
  Samantha akkineni Amidst Divorce Rumours and Wishes akkineni nagarjuna
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X