twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు వేరుగా! అక్కినేని ఫ్యామిలీ నుంచి మరోటి..

    |

    అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సినిమాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావు మొదలుకొని నేటి నాగచైతన్య, సమంత వరకు అక్కినేని వారసత్వం హుషారుగా సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వారిది ప్రత్యేక స్థానం అన్నట్లుగా కొనసాగుతోంది అక్కినేని ఫ్యామిలీ అంతా. అయితే అక్కినేని వారింట్లో కొత్త జంట, టాలీవుడ్ పాపులర్ జోడీ నాగచైతన్య, సమంత ఓ డిసీజన్ తీసుకున్నారని, వీరిద్దరూ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    అక్కినేని వారికి ఇప్ప‌టికే రెండు నిర్మాణ సంస్థ‌లున్నాయి. అందులో అన్న‌పూర్ణ స్డూడియోస్‌ బాగా పాపులర్ సంస్థ. ఈ బ్యానర్ పై లెక్కలేనన్ని హిట్ సినిమాలు రూపొందించబడ్డాయి. అక్కినేని నాగేశ్వర్ రావు తన సతీమణి అన్నపూర్ణ పేరు మీదుగా ఈ సంస్థ స్థాపించారు. ఇదిలా ఉండగానే కొన్ని సంవత్సరాల క్రితం మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ పేరిట మరో నిర్మాణ సంస్థ స్థాపించారు అక్కినేని వారు. ప్రస్తుతం ఈ సంస్థ పై కూడా యాక్టీవ్ గా సినిమాలు తీస్తున్నారు. సోలో అయితే అన్న‌పూర్ణ స్డూడియోస్‌, అలాగే ఎవరితోనైనా భాగస్వామ్యంలో సినిమా అంటే మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థల ద్వారా సినిమాలు రూపొందించేవారు. అయితే ఈ రెండు సంస్థలకు తోడు సమంత, నాగ చైతన్య కలిసి మరో నిర్మాణ సంస్థ స్థాపించనున్నారట.

    Samantha Akkineni and Naga Chaitanya decides to start a production house

    ఈ మేరకు చైతూ, సమంత ఇద్దరూ దానికి తగిన ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్. త‌మ‌కు న‌చ్చిన క‌థ‌లు వ‌చ్చిన‌ప్పుడు, త‌మ బ్యాన‌ర్‌లోనే తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో చైతూ సామ్ ఇలా నిరన్యం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఈ కొత్త బ్యానర్ ద్వారా కొత్త నటీనటులకు నాగ చైతన్య, సమంత ప్రధాన ఉద్దేశ్యమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు సొంతంగా నిర్మాణ సంస్థలు పెట్టి నడిపిస్తుండగా.. ఇప్పుడు చై సామ్ జోడీ కూడా ఇదే బాటలో వెళ్లడం సినీ హీరోహీరోయిన్లకు నిర్మాణ రంగం వైపు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

    English summary
    Samantha Akkineni and Naga Chaitanya will going to start a new production house from Akkineni family. Now from Akkineni family Annapurna Studios, Manam Enterprises are two production houses running successfully.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X