Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య, సమంతలు వేరుగా! అక్కినేని ఫ్యామిలీ నుంచి మరోటి..
అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సినిమాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావు మొదలుకొని నేటి నాగచైతన్య, సమంత వరకు అక్కినేని వారసత్వం హుషారుగా సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వారిది ప్రత్యేక స్థానం అన్నట్లుగా కొనసాగుతోంది అక్కినేని ఫ్యామిలీ అంతా. అయితే అక్కినేని వారింట్లో కొత్త జంట, టాలీవుడ్ పాపులర్ జోడీ నాగచైతన్య, సమంత ఓ డిసీజన్ తీసుకున్నారని, వీరిద్దరూ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అక్కినేని వారికి ఇప్పటికే రెండు నిర్మాణ సంస్థలున్నాయి. అందులో అన్నపూర్ణ స్డూడియోస్ బాగా పాపులర్ సంస్థ. ఈ బ్యానర్ పై లెక్కలేనన్ని హిట్ సినిమాలు రూపొందించబడ్డాయి. అక్కినేని నాగేశ్వర్ రావు తన సతీమణి అన్నపూర్ణ పేరు మీదుగా ఈ సంస్థ స్థాపించారు. ఇదిలా ఉండగానే కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎంటర్టైన్మెంట్స్ పేరిట మరో నిర్మాణ సంస్థ స్థాపించారు అక్కినేని వారు. ప్రస్తుతం ఈ సంస్థ పై కూడా యాక్టీవ్ గా సినిమాలు తీస్తున్నారు. సోలో అయితే అన్నపూర్ణ స్డూడియోస్, అలాగే ఎవరితోనైనా భాగస్వామ్యంలో సినిమా అంటే మనం ఎంటర్టైన్మెంట్స్ సంస్థల ద్వారా సినిమాలు రూపొందించేవారు. అయితే ఈ రెండు సంస్థలకు తోడు సమంత, నాగ చైతన్య కలిసి మరో నిర్మాణ సంస్థ స్థాపించనున్నారట.
ఈ మేరకు చైతూ, సమంత ఇద్దరూ దానికి తగిన ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారని ఫిలింనగర్ టాక్. తమకు నచ్చిన కథలు వచ్చినప్పుడు, తమ బ్యానర్లోనే తీసుకోవాలన్న ఆలోచనతో చైతూ సామ్ ఇలా నిరన్యం తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఈ కొత్త బ్యానర్ ద్వారా కొత్త నటీనటులకు నాగ చైతన్య, సమంత ప్రధాన ఉద్దేశ్యమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు సొంతంగా నిర్మాణ సంస్థలు పెట్టి నడిపిస్తుండగా.. ఇప్పుడు చై సామ్ జోడీ కూడా ఇదే బాటలో వెళ్లడం సినీ హీరోహీరోయిన్లకు నిర్మాణ రంగం వైపు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.