నాగచైతన్యతో నువ్వా నేనా? అన్నట్లుగా.. చివరకు సమంతదే పై చేయి

Recommended Video

It's Samantha Akkineni Vs Naga Chaitanya Akkineni At Box-Office || Filmibeat Telugu

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంత లకు భారీ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు నెటిజన్లు. అయితే తాజా ఈ యువ జంటకు సంబందించిన ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఇంతకీ ఏంటా విషయం? ఎందుకంత ఆసక్తికరం? వివరాల్లోకి పోతే..

భర్తతో సమంత పోటీ

భర్తతో సమంత పోటీ

పెళ్ళికి ముందు నుంచే స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. అక్కినేని వారింట అడుగు పెట్టాక సినిమాల జోరు మరింత పెంచేసింది. అంతేకాదు భర్త నాగచైతన్యతో పోటీపడి సినిమాలు చేస్తూ వస్తోంది. ఒకరకంగా పెళ్లయ్యాక ఆమెకు స్టార్ డమ్ రెట్టింపు అయిందనటంలో అతిశయోక్తి లేదు.

చైతూతో మజిలీ చేసి ఆ తర్వాత

చైతూతో మజిలీ చేసి ఆ తర్వాత

పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో మొదటిసారి 'మజిలీ' రూపంలో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కూడా చై, సామ్ పోటీ పడి నటించారు. దీంతో దేశ విదేశాల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ఓవర్సీస్ లో 'మజిలీ' 799 K డాలర్ల కలెక్షన్స్ వసూలు చేసింది. సోలోగా చైతూ కెరీర్ లోనే విదేశాల్లో ఇదే ది బెస్ట్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ.

నాగచైతన్య రికార్డుకు ఎసరు

నాగచైతన్య రికార్డుకు ఎసరు

ఎంతైనా భర్త నాగచైతన్యతో పోటీ పడుతుందిగా! అందుకే విదేశాల్లో 'మజిలీ' కలెక్షన్స్ దాటేసి ముందుకెళ్లింది సమంత. అదెలా అంటారా? సమంత తాజా సినిమా 'ఓ బేబీ' ఓవర్సీస్ లో ఇప్పటికే 809 K డాలర్స్ రాబట్టి మజిలీని బీట్ చేసేసింది. అంటే చైతూ సోలో రికార్డుకు ఎసరు పెట్టినట్లేగా మరి! అంతేకాదండోయ్.. విదేశాల్లో ఇంకా కూడా ఓ బేబీ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

నాగచైతన్య, సమంత సినిమాలు

నాగచైతన్య, సమంత సినిమాలు

ప్రస్తుతం నాగ చైతన్య బాబీ డైరెక్షన్‌లో 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పైకి ఇటీవలే వచ్చాడు. సమంత.. తమిళ సూపర్ హిట్ '96' తెలుగు రిమేక్ లో నటిస్తోంది. దీంతోపాటు నాగార్జున నటిస్తున్న 'మన్మథుడు 2' సినిమాలో నటిస్తోంది సామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X