పదకొండేళ్లుగా అతను నా తోనే!! ఈ స్టెప్ సక్సెస్ కావాలి.. అందరిముందే సమంత అలా!

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల పరంగానే గాక, సామాజిక సేవ పరంగా కూడా సమంత వేస్తున్న అడుగులు పలువురు హీరోయిన్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇకపోతే సామ్.. తన దగ్గరైన వ్యక్తుల పట్ల కూడా చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అసిస్టెంట్ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన ఆమె ఆసక్తికరంగా మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

సమంత అసిస్టెంట్.. పదకొండేళ్లుగా

సమంత అసిస్టెంట్.. పదకొండేళ్లుగా

ఆర్య (సమంత అసిస్టెంట్) నా కుటుంబ సభ్యుడిలాంటివాడని సమంత చెప్పింది. ‘ఏ మాయ చేసావె' చివరి షెడ్యూల్‌ సమయంలో తన అసిస్టెంట్‌‌గా చేరిన ఆర్య పదకొండేళ్లుగా తన తోనే ఉన్నాడని చెప్పింది. చలి, ఎండ, బాధ, సంతోషం ఇలా అన్నివేళలా తన తోనే ఉన్నాడని, తనను అమ్మానాన్న కంటే బాగా చూసుకున్నాడని పేర్కొంది.

అతనితో జర్నీ, అతని శ్రేయస్సు కోరుకోవడం చూసి..

అతనితో జర్నీ, అతని శ్రేయస్సు కోరుకోవడం చూసి..

తన దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూనే ఆర్య ఈ రెస్టారెంట్‌ నడుపుతున్నాడని, ఈ ప్రయత్నంలో ఆర్య విజయం సాధించాలని కోరుకుంటున్నానని సమంత తెలిపింది. ఇలా ఓ అసిస్టెంట్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి వచ్చి అతనితో జర్నీ, అతని శ్రేయస్సు కోరుకోవడం చూసి సమంత మంచి మనసు మరోసారి బయటపడిందని చెప్పుకుంటున్నారు జనం.

సమంతలో సామాజిక స్పృహ

సమంతలో సామాజిక స్పృహ

మరోవైపు సామాజిక సేవలోనూ ముందడుగేస్తున్న సమంత.. 'ప్రత్యూష సపోర్ట్' అనే పేరుతో సేవా సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ద్వారా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావాల్సిన వైద్య, విద్య ఖర్చులను భరిస్తూ చాలా కుటుంబాలకు ఆసరా అవుతోంది ఈ అక్కినేని కోడలు.

నాగ చైతన్యతో పెళ్లి.. అంతా శుభమే

నాగ చైతన్యతో పెళ్లి.. అంతా శుభమే

అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంతకు అంతా శుభమే జరుగుతోంది. పెళ్లి తర్వాత ఆమె చేసిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలు ఆమె పాపులారిటీని అమాంతం పెంచేశాయి.

Recommended Video

NTR 30 : Samantha Vs Rashmika | Samantha Likely To Be Roped Opposite NTR || Filmibeat Telugu
ఫ్యామిలీ మ్యాన్.. భాగమవుతున్న సామ్

ఫ్యామిలీ మ్యాన్.. భాగమవుతున్న సామ్

కాకపోతే ఇటీవలే సమంత లీడ్ రోల్ పోషించిన జాను మూవీ ఆశించిన మేర సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రంలో సమంత కనబర్చిన నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రస్తుతం సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో భాగమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X