తొలిరోజే ఏదో మేజిక్ జరుగుతుందని అర్థమైంది.. అది ప్రతిరోజూ కంటిన్యూ అయింది: సమంత
వెండితెరపై అక్కినేని సమంత మరోసారి సందడి చేసేందుకు ముస్తాబయింది. తమిళ నాట విడుదలై మొత్తం దక్షిణాదిని ఓ ఊపు ఊపిన 96 చిత్రానికి రీమేక్ సినిమాగా తెరకెక్కిన 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. 'జాను' మూవీ అంతా ప్రధానంగా రెండు క్యారెక్టర్స్ మధ్యనే సాగుతుంది. ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు చేశాను. సీన్‌లో ముప్పై, నలభై మంది ఆర్టిస్టులతో పనిచేశాను. కానీ.. వాటితో పోల్చితే ఈ సినిమా పూర్తి భిన్నమైనదని సమంత చెప్పింది.

జానులో హీరో, హీరోయిన్ పెర్ఫామెన్స్ బాగా హైలైట్ అవుతుందని చెప్పిన సామ్.. ఈ అవుట్ పుట్ అనేది గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అని పేర్కొంది. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ బాగా ఎంజాయ్ చేశానని తెలిపింది. తొలిరోజే తనకు ఏదో మేజిక్ జరుగుతుందని అర్థమైందని, ఆ మేజిక్ ప్రతిరోజూ కంటిన్యూ అయ్యిందని చెప్పింది సమంత. రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా ఆ మేజిక్‌ని ఫీల్ అవుతారని ఆమె చెప్పుకొచ్చింది.
శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా రూపొందింది జాను మూవీ. హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











