ఓ మై గాడ్.. యంగ్ హీరోపై సమంత కామెంట్.. వాట్ ఎ క్రేజీ

నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది సమంత. ఇది వరకే ఆమెకున్న క్రేజ్, ఫాలోయింగ్‌కి అక్కినేని బ్రాండ్ రెక్కలు కట్టేసింది. అపజయమనేదే లేదన్నట్లుగా సమంత జర్నీ సాగుతోంది. కాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా ఓ యంగ్ హీరోపై క్రేజీ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి పోతే..

నేటి యువతరానికి కిక్కిచ్చేలా యంగ్ హీరో

నేటి యువతరానికి కిక్కిచ్చేలా యంగ్ హీరో

తన కొత్త సినిమాలో లుక్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య. ఒకదానివెంట ఒకటి సక్సెస్ స్టెప్స్ వేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఆయన.. గత సినిమాల్లో కంటే పిట్‌గా కనిపించేందుకు బాగా ట్రై చేస్తున్నాడు. ఈ మేరకు నేటి యువతరం మనసు దోచుకోవాలని సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

డాడీ నన్ను తిట్టి ఇలా చేయించారు

డాడీ నన్ను తిట్టి ఇలా చేయించారు

తాజాగా తానూ జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాగశౌర్య. ‘డాడీ నన్ను ఈ ఫొటో పోస్ట్‌ చేయమన్నారు. నేను క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేసే లోపు, తిట్టి నాతో ఏ క్యాప్షన్‌ లేకుండా ఇలా పోస్ట్‌ చేయించారు' అని ఆ ఫోటోపై ట్యాగ్ చేశాడు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.

సమంత కంట్లో పడటంతో..

అయితే నాగశౌర్య పోస్ట్ చేసిన ఈ పిక్ సమంత కంట్లో పడటంతో ఆమె వెంటనే స్పందించింది. ‘ఓ మై గాడ్.. వాట్ ఈజ్ థిస్ క్రేజీనెస్' అని కామెంట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజిని షేర్ చేసింది. దీంతో నాగశౌర్య లుక్, సమంత క్రేజీ కామెంట్ ఇరువురి అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఓ బేబీ పుషింగ్.. నాగశౌర్య, సమంత జర్నీ

ఓ బేబీ పుషింగ్.. నాగశౌర్య, సమంత జర్నీ

ఇటీవలే నాగశౌర్య, సమంత కలిసి సినీ జర్నీ చేసిన సంగతి తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' సినిమాలో ఇద్దరూ కీలక పాత్రలు పోషించి భేష్ అనిపించుకున్నారు. ఇటు సమంతకు, అటు నాగశౌర్యకు కెరీర్ పరంగా మంచి పుషింగ్ ఇచ్చింది ఓ బేబీ. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సామ్, నాగశౌర్య మంచి స్నేహితులుగా మారారట.

శర్వానంద్‌తో సమంత రొమాన్స్

శర్వానంద్‌తో సమంత రొమాన్స్

ఇక ప్రస్తుతం నాగశౌర్య.. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కాగా సమంత '96' సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. అతి త్వరలో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X