తెలుగు సినీ పరిశ్రమకు గోల్డెన్ డేస్: అక్కినేని కోడలు సమంత కామెంట్
ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దాడి చేసేందుకు దిగాయి టాలీవుడ్ సినిమాలు. పోటాపోటీగా పండగ బరిలో నిలిచారు మహేష్ బాబు, అల్లు అర్జున్. ఒక్కరోజు తేడాలో తమ తమ 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కొత్త సంవత్సరానికి గ్రేట్ స్టార్ట్ ఇస్తూ తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.
శనివారం రోజున (జనవరి 11) విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ సూపర్ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ రోజు (ఆదివారం) విడుదలైన 'అల వైకుంఠపురములో' మూవీ తొలి షోతోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2020 స్టార్టింగ్‌లో ఈ రెండు సినిమాలు తెలుగు ఫిలింఇండస్ట్రీకి మంచి బూస్టింగ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలను ఉద్దేశిస్తూ అక్కినేని కోడలు, టాలీవుడ్ బ్యూటీ సమంత ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపింది.

''తెలుగు సినీ పరిశ్రమకు గోల్డెన్ డేస్. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో'.. రెండు సినిమాలు 2020కి గ్రేట్ స్టార్ట్ ఇచ్చాయి. ఈ చిత్రాల విజయానికి కారణమైన క్రేజీ ఫ్యాన్స్‌తో పాటు రెండు చిత్ర బృందాలకు బిగ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్'' అంటూ సమంత ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ చూసిన అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానులు ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ''మీ సినిమా కోసం వెయిటింగ్'' అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











