Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత.. యూటర్న్ కోసం..
రంగస్థలం, మహానటి, అభిమన్యుడు హాట్రిక్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న సమంత తాజాగా యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. కన్నడలో ఘనవిజయం సాధించిన యూటర్న్ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రెండు భాషల్లో రూపొందించిన చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించడం గమనార్హం.
తెలుగు, తమిళ యూటర్న్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియో సాంగ్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రిలీజ్ చేశాడు. ఆ పాటలో అనిరుధ్ పాడటంతోపాటు డ్యాన్సులు కూడా చేశాడు. అనిరుధ్ రూపొందించిన వీడియోలో సమంత కూడా దుమ్మురేగేలా డ్యాన్సులు చేసింది.
ఈ నగరానికి ఏమైంది ఫేం, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి యూటర్న్ ప్రమోషనల్ వీడియోను చిత్రీకరించారు. కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ పాటనకు యశ్వంత్ కోరియోగ్రఫిని అందించారు. ఈ వీడియో సాంగ్‌లో సమంత స్టైలిష్ సెప్టులతో అదరగొట్టింది.
యూటర్న్ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. రోడ్డు ప్రమాదం కథా నేపథ్యంగా సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్నది.