Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాక్డౌన్లో కూడా సమంత డేరింగ్‌గా.. ఫ్యామిలీ మ్యాన్ కోసం టెర్రరిస్టుగా
కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సమంత అక్కినేని మళ్లీ సినిమాల పనులతో బిజీగా మారబోతున్నారు. ఇప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న వెబ్ సిరీస్‌పై సమంత దృష్టిపెట్టారు. ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 కోసం డబ్బింగ్ చెబుతున్నానని సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
చురుకుగా ఫ్యామిలీ మ్యాన్ 2 డబ్బింగ్ పనులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 1కు విశేషమైన ఆదరణ దక్కింది. మనోజ్ బాజ్పేజ్, ప్రియమణి తదితర నటీనటులకు మంచి పేరును ఈ వెబ్ సిరీస్ తెచ్చిపెట్టింది. ఆ వెబ్ సిరిస్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఫ్యామిలీ మ్యాన్2 ద్వారా సమంత వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డబ్బింగు పనులు హైదరాబాద్‌లో చురుకుగా కొనసాగుతున్నాయి.
థ్యాంక్యూ అంటూ సమంత పోస్ట్
డబ్బింగ్ వాయిస్ రికార్డు చేసే మైక్రోఫోన్ వెనుక నిలబడి దిగిన ఫోటోను సమంత షేర్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం డబ్బింగ్ చెబుతున్నాను. ఓ మైగాడ్ మీ క్రేజీ రైడ్ ఆశ్చర్యం కలిగిస్తున్నది. థ్యాంక్స్ కృష్ణ డీకే, రాజ్ నిడిమోరు అంటూ సమంత కామెంట్ చేశారు. దీంతో మళ్లీ ఆమె సినిమా పనుల్లో బిజీగా మారిపోయారనే విషయం స్పష్టమైంది.
టెర్రరిస్టు పాత్రలో కనిపించేందుకు
త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్న ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ సిరీస్‌లో సమంత టెర్రిరిస్టుగా కనిపించబోతున్నట్టు సమాచారం. సమంతను వేటాడే పోలీస్ ఆఫీసర్ పాత్రను మనోజ్ బాజ్‌పేయ్ చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కు కృష్ణ డీకే, రాజ్ నిడిమోరు నిర్మాత, దర్శకులుగా వ్యవహరించారు.
సమంత అక్కినేని కెరీర్ ఇలా
సమంత కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన జాను చిత్రం తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కాతు వాకులా రెండు కాదల్ చిత్రంతోపాటు అశ్విన్ శరవణన్ సినిమాకు ఒకే చెప్పారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రూపొందించే కాతు వాకులా రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించడానికి అంగీకరించారు. లాక్ డౌన్ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.