తమిళ, తెలుగులో సమంత డబ్బింగ్.. తొలిసారి హిందీలోకి
లాక్‌డౌన్ తర్వాత అందాల భామ సమంత అక్కినేని బిజీగా మారిపోతున్నారు. దాదాపు మూడు నెలలపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన సమంత ఇక తన ఫోకస్ సినిమాలు, వెబ్ సిరీస్‌పై పెట్టారు. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే వాస్తవానికి సమంత తెలుగు, తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పరు. ఆమె పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెబుతుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారనే విషయం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ చెప్పడానికి సమంత స్వయంగా హిందీ నేర్చుకొంటున్నారు.

ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో రొటీన్‌కు భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె టెర్రరిస్టుగా కనిపించబోతున్నారు. ఆ పాత్ర నాకు చాలా ఎక్సైటింగ్‌ను కల్పించిందని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదనేది తాజా సమాచారం.
సమంత కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన జాను చిత్రం తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కాతు వాకులా రెండు కాదల్ చిత్రంతోపాటు అశ్విన్ శరవణన్ సినిమాకు ఒకే చెప్పారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రూపొందించే కాతు వాకులా రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించడానికి అంగీకరించారు.


Click it and Unblock the Notifications











