అప్పటితో పోలిస్తే ఇప్పుడు చైతూతో చాలా మార్పు వచ్చింది.. సమంత
టాలీవుడ్ క్రేజీ జోడీ సమంత, నాగచైతన్యల గురించిన అప్‌డేట్స్ పై చాలా ఆసక్తికరంగా ఉంటారు ఆడియన్స్. ఆ ఆసక్తిని క్యాచ్ చేస్తూ తనకు, తన ఫ్యామిలీకి సంబందించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది సామ్. ఈ కోవలోనే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో చైతూ గురించి ఆసక్తికరంగా స్పందించింది సమంత.
అక్కినేని కోడలిగా మారాక సమంత తన సినిమాల జోరును మరింత పెంచేసింది. వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ జర్నీ సాగిస్తున్న సమంత.. మరి కొద్దిరోజుల్లోనే ఓ బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన కెరీర్‌లో వచ్చిన ఏ సినిమాపై పెట్టనంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ సినిమాపై పెడుతోంది సామ్. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన కార్యక్రమంలో ఓ బేబీ సినిమా సంగతులు, నాగచైతన్య కు సంబందించిన విశేషాలు తెలిపింది.

ఓ బేబీ దర్శకురాలు నందినీ రెడ్డి తనకు సోదరి లాంటిదని సమంత చెప్పింది. ఇప్పటివరకు తన కెరీర్‌లో వచ్చిన సినిమాల్లో కెల్లా ఓ బేబీ లోని పాత్రనే స్పెషల్ అంటోంది సమంత. చిత్రంలో రాజేంద్రప్రసాద్ కామెడీ చూసి చాలా నేర్చుకున్నానని, ఆయన కామెడీ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని చెప్పిన ఆమె.. ఆ తర్వాత తన భర్త నాగచైతన్య గురించి మాట్లాడింది. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచి మొదలుకొని 'మజిలీ' వరకు చూస్తే ఆయనలో చాలా మార్పు వచ్చిందని సామ్ చెప్పుకొచ్చింది. నాగచైతన్య మంచి నాన్న అవుతాడనే నమ్మకం తనకుందని ఈ సందర్బంగా సమంత వెల్లడించింది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సమంత, నాగశౌర్య జోడీగా ఓ బేబీ సినిమా రూపొందింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. చిత్రంలో 70 ఏళ్ల యువతిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో సమంత నటించింది. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











