అంతా సెట్ చేసుకున్న సమంత.. ముహూర్తం ఫిక్స్
వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ హుషారుమీదున్న సమంత ఇటీవలే 'ఓ బేబీ'గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ అంచనాలను మించి రాణించింది. దీంతో అదే జోష్‌లో శర్వానంద్ సరసన చేరింది సామ్. ఈ యంగ్ హీరోతో కలిసి 'జాను' సినిమాలో నటించింది.
తమిళంలో సూపర్ హిట్ సాగించిన 96 సినిమాను 'జాను' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినిమాలో సమంత పేరు జానకి అలియాస్ జాను.. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ద్వారా అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా చిత్ర ట్రైలర్ కూడా సిద్ధం చేసి రిలీజ్‌కి ముహూర్తం పెట్టేశారు.

ఈ మేరకు 'జాను' ట్రైలర్ ఈ రోజు (జనవరి 29) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రంలో చిన్ననాటి స్నేహితులుగా, క్లాస్‌మేట్స్‌గా శర్వానంద్, సమంత కనిపించనున్నారు. ఫిబ్రవరి 7న 'జాను' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.


Click it and Unblock the Notifications











