For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ నెం 1 సమంతనే.. కానీ టాప్ టెన్ లిస్టులో మార్పులు... సర్వేలో టాప్ ఎవరంటే?

  |

  ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది మే నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆ తర్వాతి స్థానాన్ని అల్లు అర్జున్ కూడా తమ స్థానాలు నిలుపుకున్నారు. ఇక హీరోలను ప్రకటించినట్టుగానే హీరోయిన్స్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో కూడా దాదాపు పాత స్థానాలను మళ్ళీ నిలుపుకున్నారు హీరోయిన్లు. ఆ వివరాల్లోకి వెళితే

  నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

  1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

  1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

  టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత ప్రతి నెల లాగే ఈ నెలలో కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం ఒక తమిళ, అలాగే శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఇక కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగైదు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది.

  అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

  3- అనుష్కశెట్టి 4- రష్మిక మందన్నా

  3- అనుష్కశెట్టి 4- రష్మిక మందన్నా

  అయితే ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన అనుష్క ఈ జాబితాలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క ఇప్పటికీ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. అయినా ఆమె లిస్టులో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆమె ఏడవ స్థానంలో ఉండగా ఇప్పుడు నాలుగుకు చేరింది. ఆమె చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తోంది.

  మెగాస్టార్, సూపర్ స్టార్స్ వాడుతున్న ఖరీదైన, విలాసవంతమైన కార్లు ఇవే..

  5- తమన్నా 6- కీర్తి సురెష్

  5- తమన్నా 6- కీర్తి సురెష్

  మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా సీటీమార్ సినిమాలో నటించిన ఆమె ప్రస్తుతం తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం మాస్ట్రో సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. అయితే కీర్తిసురేష్ ఈ జాబితాలో ఆరవ స్థానానికి ఎగబాకింది. నిజానికి ఆమె గతంలో ఎనిమిదవ స్థానంతో ఉండగా ఇపుడు ఆరో స్థానానికి వెళ్ళింది. ఇక ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

  Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

  7-పూజా హెగ్డే 8-రకుల్ ప్రీత్ సింగ్

  7-పూజా హెగ్డే 8-రకుల్ ప్రీత్ సింగ్

  ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానం నుంచి ఏడో స్థానానికి దిగజారింది. చివరిగా అల వైకుంఠ పురంలో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలానే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. గతంలో ఆమె ఆరో స్థానం సంపాదించింది. చివరిగా చెక్ సినిమాలో మానస పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

  9 - రాశి ఖన్నా 10 -సాయి పల్లవి

  9 - రాశి ఖన్నా 10 -సాయి పల్లవి

  గత నెలలో జాబితాలో స్థానం కోల్పోయిన రాశి ఖన్నా ఈ జాబితాలో తొమ్మిదో స్థానం సంపాదించింది. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతానికి పక్కా కమర్షియల్ అలాగే థాంక్యూ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

  చివరిగా ఎన్జీకే అనే తమిళ సినిమాతో సూర్య భార్యగా నటించిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాతో, విరాటపర్వం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడ్డాయి. ఇక గత నెలలో తొమ్మిదో స్థానంలో నిలిచిన అనుపమా పరమేశ్వరన్ ఈ నెలలో జాబితాలో చోటు దక్కించుకోలేక పోయింది.

  English summary
  Ormax Media has released the top ten lists of Top Telugu actors and actresses for august 2021. Samantha akkineni has beaten Kajal aggarwal, Anushka Shetty, pooja Hegde, rashmika mandanna, keerthy Suresh, tamanna bhatiya, sai pallavi, rakul Preet Singh, Rashi khanna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X