టాలీవుడ్ నెం 1 గా సమంత . రెండో స్థానంలో కాజల్, మీడియా సంస్థ సర్వేలో ఆసక్తికర ఫలితాలు

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది ఏప్రిల్ నెలకు గాను టాప్ 10 తెలుగు హీరోలు, హీరోయిన్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు హీరోగా మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. ఇక అదే విధంగా హీరోయిన్స్ జాబితాను కూడా రిలీజ్ చేయగా అందులో సమంతా అక్కినేని మొదటి స్థానంలో నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

1 - సమంత అక్కినేని 2 - కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక తమిళ సినిమాలో అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విభాగంలో కాజల్ అగర్వాల్ రెండో స్థానానికి పరిమితమైంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగైదు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే సినిమాలో నటిస్తోంది.

3- అనుష్క శెట్టి 4- కీర్తి సురేష్

3- అనుష్క శెట్టి 4- కీర్తి సురేష్

లేడీ సూపర్ స్టార్ అనుష్క ఈ జాబితాలో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క ఇప్పటికీ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. ఆమె నవీన్ పోలిశెట్టి సరసన ఒక సినిమా చేయబోతోందని ప్రచారం అయితే జరుగుతోంది. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక మహానటి కీర్తిసురేష్ ఈ జాబితాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రెండు తమిళ ఒక మలయాళం సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.

5-పూజా హెగ్డే 6- రష్మిక మందన్న

5-పూజా హెగ్డే 6- రష్మిక మందన్న

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో ఐదవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరిగా అల వైకుంఠ పురం లో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది.. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తోంది. గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె చివరిగా పొగరు అనే తెలుగు కన్నడ బై లింగ్యువల్ సినిమాతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే తమిళంలో సుల్తాన్ అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.

7-తమన్నా భాటియా 8- సాయి పల్లవి

7-తమన్నా భాటియా 8- సాయి పల్లవి

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఏడవ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం సిటీ మార్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం మాస్ట్రో సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. మలయాళ భామ సాయి పల్లవి ఎనిమిదో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. చివరిగా ఎన్జికే అనే తమిళ సినిమాతో సూర్య భార్యగా నటించిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. విరాటపర్వం సినిమా పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇక ఆమె శ్యామ్ సింగారాయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 9 -రాశి ఖన్నా 10 -రకుల్ ప్రీత్ సింగ్

9 -రాశి ఖన్నా 10 -రకుల్ ప్రీత్ సింగ్


రాశి ఖన్నా ఈ జాబితాలో తొమ్మిదో స్థానానికి పరిమితం అయింది. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతానికి పక్కా కమర్షియల్ అలాగే థాంక్యూ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అరడజనుకు పైగా తమిళ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో పదో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. చివరిగా చెక్ సినిమాలో మానస పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ప్రస్తుతం మరో తెలుగు సినిమా చేయడం లేదు. క్రిష్ దర్శకత్వంలో ఆమె చేసిన కొండపొలం అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక తెలుగు కాకుండా ఆమె హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X